గజల్ శ్రీనివాస్ 'చీకటి కోణాలు'?: జూ.ఆర్టిస్టులను రప్పించుకుని ఆఫీసులోనే రాసలీలలు!..

Recommended Video

గజల్ శ్రీనివాస్ గదిలో నగ్నంగా : అలాంటివాడు కాదంటూ మరో కోణం ?

పొద్దున లేస్తే ఆదర్శాలు వల్లించడం.. మహిళలంటే ఎనలేని గౌరవమని ఇంటర్వ్యూల్లో మాటలు దంచడం.. కేశిరాజు శ్రీనివాస్ అలియాస్ గజల్ శ్రీనివాస్‌లో ఇదంతా ఒక కోణం మాత్రమే. సమాజానికి తెలియని చీకటి కోణాలు అతనిలో చాలానే ఉన్నట్లున్నాయి. పైకి పెద్ద మనిషిలా పోజు కొడుతూనే.. నిండా అసభ్యతను పులుముకున్న చీడపురుగులా గజల్ శ్రీనివాస్ తయారయ్యాడన్న విమర్శలు వినిపిస్తున్నాయి..

 పక్కా సాక్ష్యాధారాలతో..:

పక్కా సాక్ష్యాధారాలతో..:

గజల్ శ్రీనివాస్ లైంగిక వేధింపులను తట్టుకోలేక ధైర్యం చేసి పోలీసుల ముందుకు వచ్చిన బాధితురాలు.. పక్కా ఆధారాలను వారికి సమర్పించింది. పోలీసులు కూడా గజల్ శ్రీనివాస్ పై కేసు నమోదు చేయడానికి మొదట కాస్త సందేహించినప్పటికీ.. బాధితురాలు వద్ద అన్ని సాక్ష్యాధారాలు ఉండటంతో.. అతనిపై చర్యలు తీసుకోక తప్పలేదు.

 అసాంఘీక కార్యకలాపాలు:

అసాంఘీక కార్యకలాపాలు:

'సేవ్ టెంపుల్' ఫౌండేషన్ పేరుతో సంస్థను నడుపుతున్న గజల్ శ్రీనివాస్.. దాని మాటున అనేక అసాంఘీక కార్యకలాపాలకు పాల్పడుతున్నట్లు బాధితురాలి మాటల్లో వ్యక్తమవుతోంది. ఆఫీస్ లోనే బెడ్ రూమ్ ఏర్పాటు చేసుకున్నాడని,అప్పుడప్పుడు జూనియర్ ఆర్టిస్టులను సైతం తీసుకొచ్చుకునేవాడని బాధితురాలు చెబుతున్నారు.

 జూ.ఆర్టిస్టులతో..:

జూ.ఆర్టిస్టులతో..:

అలా జూనియర్ ఆర్టిస్టులను ఆఫీసుకు తీసుకొచ్చినప్పుడు.. తనతో పాటు అక్కడ పనిచేస్తున్నవాళ్లందరిని అర్థాంతరంగా బయటకు పంపించేవాడని బాధితురాలు చెప్పారు. మళ్లీ ఆయన ఫోన్ చేసేవరకు తామంతా బయటే ఉండేవాళ్లమని.. ఆ ఆర్టిస్టులు వెళ్లిపోయాక తమను పిలిచేవాడని చెప్పారు.

 టార్చర్..:

టార్చర్..:

బాధితురాలి మాటల్ని బట్టి చూస్తుంటే గజల్ శ్రీనివాస్ కు ఇంకా చాలానే సంబంధాలున్నట్లు తెలుస్తోంది. తల్లిదండ్రులు తమపై నమ్మకంతో ఉద్యోగాలకు పంపిస్తే.. గజల్ శ్రీనివాస్ లాంటి వాళ్లు తమను చెడగొట్టడానికి ప్రయత్నిస్తున్నారని బాధితురాలు ఆరోపించారు. నాకు నేనే మసాజ్ చేస్తానని ఆయన వద్దకు వెళ్లినట్లు గజల్ శ్రీనివాస్ చేస్తున్న ఆరోపణల్లో నిజం లేదన్నారు.

ఎక్కడ జాబ్ రాకుండా చేస్తానని

ఎక్కడ జాబ్ రాకుండా చేస్తానని

గత రెండు నెలలుగా తనకు టార్చర్ ఎక్కువైపోయిందని, కావాలనే పని సమయం పెంచేవాడని బాధితురాలు చెబుతున్నారు. పని మానేద్దామనుకుంటే.. నీకెక్కడ జాబ్ రాకుండా చేస్తానని కూడా బెదిరించాడన్నారు.

పనిమనిషి పార్వతి కూడా గజల్ శ్రీనివాస్‌కు లొంగిపోవాలని తనను విపరీతంగా వేధించినట్లు తెలిపారు. గజల్ కోరుకున్నట్లు చేస్తే భవిష్యత్తు బాగుంటుందని ఆమె బలవంతపెట్టినట్లు చెప్పుకొచ్చారు.

 గదిలో నగ్నంగా పడుకుని..:

గదిలో నగ్నంగా పడుకుని..:

గదిలో నగ్నంగా పడుకుని పనిమనిషితో తనను లోపలికి పిలిపించేవాడని, మసాజ్ చేయమని తనను బలవంతం చేసేవాడని బాధితురాలు కన్నీటిపర్యంతం అయ్యారు. తాను అలాంటిదాన్ని కాదు కాబట్టే గజల్ కు లొంగలేదని, తనలాంటి పరిస్థితి మరో ఆడపిల్లకు రావద్దనే ధైర్యం చేసి పోలీసుల ముందుకు వచ్చానని, పోలీసులు కూడా తనకు పూర్తిగా సహకరించారని ఆమె అన్నారు. కెమెరాతో గజల్ శ్రీనివాస్ అసభ్య వేషాల్ని చిత్రీకిరించినట్లు తెలిపారు.

 ఇంటర్వ్యూలో ఆదర్శాలు..:

ఇంటర్వ్యూలో ఆదర్శాలు..:

ఇంత నీచానికి పాల్పడినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న గజల్ శ్రీనివాస్.. ఇంటర్వ్యూల్లో మాత్రం ఆదర్శాలు వల్లించడం గమనార్హం. తనకెవరైనా గర్భిణీ స్త్రీని చూస్తే ముచ్చటేస్తుందని.. వాళ్లు మోసేది శిశువును కాదు.. భావి భారతాన్ని అని ఓ ఇంటర్వ్యూలో చెప్పారు.

అలాగే రోడ్డు దాటుతున్న మహిళలెవరైనా తన కారుకు అడ్డొస్తే.. కారు ఆపి మరీ వాళ్లు వెళ్లాకే తాను వెళ్తానని, వెనకాల ఎంతమంది హారన్ కొట్టినా పట్టించుకోనని అన్నారు.

 ఏం తేలుతుందో:

ఏం తేలుతుందో:

ప్రస్తుతం చంచల్ గూడ జైల్లో రిమాండ్‌లో ఉన్న గజల్ శ్రీనివాస్ నుంచి ఇంకా ఎలాంటి విషయాలు బయటపడుతాయోనన్న ఆసక్తి నెలకొంది. గజల్ లో కనిపించని చీకటి కోణాలు ఇంకా ఉన్నాయా? అన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి. మరికొద్ది రోజుల్లో వీటన్నింటికి సమాధానం దొరకవచ్చునేమో!

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X