రామ్ చరణ్- అల్లు అర్జున్ గీతా ఆర్ట్స్ చిత్రం
తాజాగా చిరు తనయుడు రామ్ చరణ్ నటించిన 'మగధీర" చిత్రం సెన్సేషనల్ హిట్ సాధించిన విషయం తెల్సిందే. గీతా ఆర్ట్స్ బ్యానర్ పై ఈ చిత్రం రూపొందిపబడినది. ఈ చిత్రం ఇచ్చిన గణ విజయం తో యువ హీరోలతో భారీ బడ్జట్ చిత్రాన్ని నిర్మించాలని అల్లు అరవింద్ భావిస్తున్నారు. యంగ్ హీరోలు ఇద్దరితో కలిపి గీతా ఆర్ట్స్ ఓ భారీ చిత్రాన్ని నిర్మించేందుకు సన్నాహాలు చేస్తోంది. ఇంతకీ ఆ ఇద్దరు హీరోలు ఎవరంటే? రామ్ చరణ్-అల్లు అర్జున్. తెలుగు చిత్ర పరిశ్రమలోనే ఒక మైలురాయిగా నిలిచి పోయేలా ఈ చిత్రాన్ని నిర్మించాలని ఆ బ్యానర్ అధినేత అల్లు అరవింద్ ప్లాన్ చేస్తున్నారు.
ప్రస్తుతం 'మగధీర' చిత్రాన్ని హిందీలో రీమేక్ చేసే పనుల్లో నిమగ్నమైవున్నారు. ఇందులో హృతిక్ రోషన్ లేదా అమీర్ ఖాన్‌లలో ఎవరో ఒకరు హీరోగా చేసే అవకాశం ఉంది. ఆ తర్వాత హీరో పవన్ కళ్యాణ్‌తో వివి.వినాయక్ దర్శకత్వంలో ఓ చిత్రాన్ని నిర్మించేందుకు ప్లాన్ చేస్తున్నారు. ఈ చిత్రం 2010లో ప్రారంభించనున్నారు. ఆ తర్వాత సినీ అభిమానులకు, రామ్ చరణ్, అల్లు అర్జున్ అభిమానులను పూర్తిగా సంతృప్తి పరిచే స్థాయిలో వీరిద్దరితో కలిపి మరో చిత్రాన్ని నిర్మించతలపెట్టారు. ఇందుకోసం అవసరమైన బలమైన కథ కోసం నిర్మాత పలువురు కథా రచయితలను సంప్రదిస్తున్నట్టు సమాచారం. 2011లో సెట్స్‌పైకి వెళ్లే ఈ చిత్రం తెలుగు వెండితెర చిత్ర పరిశ్రమలోనే ఒక మైలురాయిగా నిలిచిపోయేలా నిర్మించాలని భావిస్తున్నారు. అలాంటి కథ కోసం నిర్మాత అన్వేషణ మొదలు పెట్టినట్లు సినిమా వర్గాల సమాచారం. ప్రస్తుతం వీరి కాంబినేషన్ తీయబోయే చిత్రానికి ఎవరు దర్శకత్వం వహిస్తారు, సబ్జెక్ట ఏమిటి అనే విషయాలపై చర్చలు జరుగుతోన్నట్టు బోగట్ట.


Click it and Unblock the Notifications











