100% లవ్ పైరసీకి ఐదు కోట్లు చెల్లించాలని పివిఆర్‌కు అల్లు అరవింద్ నోటీసు
నాగ చైతన్య, తమన్నా జంటగా నటించిన 100% లవ్ సినిమా పైరసీకి గాను గీతా అర్ట్ర్స్ అధినేత అల్లు అరవింద్ పివిఆర్ సినిమా సంస్థపై ఐదు కోట్ల రూపాయలకు దావా వేశారు. తెలుగు చలనచిత్ర పరిశ్రమను వీడియో పైరసీ విపరీతంగా పీడిస్తున్న విషయం తెలియంది కాదు. సినీ ప్రముఖులు పోరాడినా పెద్దగా ఫలితం ఉండడం లేదు. 100% లవ్ చిత్రం మే 6వ తేదీన ప్రపంచవ్యాప్తంగా విడుదలైంది. పైరసీ కాకుండా కొన్ని జాగ్రత్తలు తీసుకున్నప్పటికీ ఫలితం లేకుండా పోయింది.
పైరసీ విషయాన్ని తీవ్రంగా పరిగణంచిన గీతా ఆర్ట్ర్స్ అధినేత అల్లు అరవింద్ కూపీ లాగారు. పైరసీ ఎక్కడ జరిగిందో తెలుకోగలిగారు. మే 6 నుంచి 13వ తేదీ మధ్యలో హర్యానాలోని గుర్గావ్‌లో పివిఆర్ స్క్రీన్ నెంబర్ 6లో ఈ పైరసీ జరిగినట్లు ఆయన గుర్తించారు. దీంతో ఐదు కోట్ల రూపాయల నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్ చేస్తూ పివిఆర్ యాజమాన్యానికి లీగల్ నోటీసు ఇచ్చారు.


Click it and Unblock the Notifications











