బాలీవుడ్ సూపర్ స్టార్ షారూఖ్ తో ఓ సినిమా చెయ్యటానికి గీతా ఆర్ట్స్ తాజాగా ఎగ్రిమెంట్ కుదుర్చుకుందని సమాచారం. అల్లు అరవింద్ కుమారుడు అల్లు శిరీష్ ఈ చిత్రానికి ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ గా వ్యవరిస్తారు. ఇప్పటికే కథ ఫైనలైజ్ అయ్యిందని పేరొందిన ఓ సౌత్ డైరక్టర్ ఈ చిత్రాన్ని డైరక్ట్ చేస్తాడని సమాచారం.అయితే ఆ దర్శకుడు మురగదాసేనని కొందరంటున్నారు. తెలుగులో హిట్టయిన ఠాగూర్ చిత్రాన్ని అక్కడ షారూఖ్ తో ప్లాన్ చేసే యోచనలో ఉన్నారని సమాచారం. గజనీ హిట్ తో గీతా ఆర్ట్స్ బాలీవుడ్ లో ప్రత్యేకమైన ఇమేజ్ సంపాదించుకుంది. దాన్ని సుస్దిరం చేసే దిశలో సినిమాలు చేస్తామని ఆ సంస్ధ ప్రతినిధులు చెప్తున్నారు. అది నిజం కావాలని కోరుకుందాం. ప్రస్తుతం షారూఖ్ హాస్పటిల్ లో రెస్ట్ తీసుకుంటున్నారు. ఆయన తాజాగా చేసిన భిల్లు చిత్రం భాక్సాఫీస్ వద్ద పెద్ద విజయాన్ని నమోదు చేయలేదు. తెలుగులో వచ్చిన కధానాయుకుడు చిత్రం కథతో ఈ చిత్రం రీమేక్ గా వచ్చింది.