‘మర్యాద రామన్న’ రీమేక్‌లో హర్భజన్ ప్రియురాలు
చెన్నై: క్రికెటర్ హర్భజన్ సింగ్ ప్రియురాలు, బాలీవుడ్ నటి గీతా బస్రా త్వరలో తెలుగు సూపర్ హిట్ మూవీ 'మర్యాద రామన్న' చిత్రానికి రీమేక్ గా రూపొందుతున్న ఓ చిత్రంలో నటించబోతోంది. ఈచిత్రంలో ఆమె తమిళ కామెడీ స్టార్ సంతానంతో కలిసి రొమాన్స్ చేయబోతోంది.
యుకెలో పుట్టి పెరిగిన గీతా బస్రా మెడలింగ్ చేస్తూ ఆ తర్వాత బాలీవుడ్లోకి అడుగు పెట్టింది. ఈక్రమంలోనే క్రికెటర్ హర్భజన్ సింగ్ తో పరిచయం ప్రేమగా మారి కొంతకాలంగా డేటింగ్ చేస్తోంది. ఇప్పటికే ఆమె పలు హిందీ చిత్రాల్లో నటించింది. ఇటీవల విడుదలైన జిల్లా గజియాబాద్ చిత్రంలో స్పెషల్ రోల్ పోషించింది.
తాజాగా ఆమె సంతానం హీరోగా రూపొందనున్న చిత్రంలో నటించబోతోంది. మర్యాద రామన్న చిత్రం ఇప్పటికే తెలుగులో విజయం సాధించడం, అదే విధంగా హిందీ రీమేక్ కూడా సక్సెస్ కావడంతో.... ఇదే సినిమా తమిళ వెర్షన్ లో నటించే అవకాశం రావడంతో గీతా బస్రా వెంటనే సైన్ చేసినట్లు తెలుస్తోంది.
మిగతా వివరాలు స్లైడ్ షోలో...

సంతానం సినిమాలు తాను ఇప్పటికు చూడలేదని, అయితే అతని గురించి విన్నానని గీతా అంటోంది.

ఈ తమిళ వెర్షన్ చిత్రానికి శ్రీనాథ్ దర్శకత్వం వహించనున్నారు.

త్వరలో ఆమె సంతానంను కలవనుంది, ఆ తర్వాతనే హీరోయిన్ గా ఆమె నటించే విషయం ఖరారవుతుందని అంటున్నారు.

ఇటీవల వీరు ఇద్దరు కలవడానికి ప్రత్నించినప్పటికీ అనుకోకోని కారణాలతో కలవలేదని, త్వరలో మళ్లీ కలిసేందుకు ప్రయత్నిస్తున్నారని మీడియా టాక్

తెలుగు వెర్షన్ మర్యాద రామన్న చిత్రానికి రాజమౌళి దర్శకత్వం వహించగా సునీల్-సలోని హీరో హీరోయిన్లుగా నటించారు.


Click it and Unblock the Notifications











