twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    రష్మిక ఓ బంగారు బాతు.. 100 కోట్ల హీరోయిన్.. ప్రొడ్యూసర్ కామెంట్‌తో..

    |

    Recommended Video

    Geetha Chalo Movie Press Meet | Rashmika Mandanna | Naga Shaurya || Filmibeat Telugu

    ఛలో, గీత గోవిందం, దేవదాస్‌... ఇలా వరుస విజయాలతో తనకంటూ తెలుగులో మార్కెట్‌ను క్రియేట్‌ చేసుకున్నారు రష్మిక మంద‌న‌. వరుస సినిమాలతో బిజీగా ఉన్న రష్మిక‌ నటించిన గీతా.. ఛలో మే3న విడుదలవుతోంది. దివాకర్‌ సమర్పణలో మామిడాల శ్రీనివాస్, దుగ్గివలస శ్రీనివాస్ నిర్మాత‌లుగా శ్రీ రాజేశ్వరి ఫిలింస్ -మూవీ మాక్స్‌ బ్యానర్లపై ఈ చిత్రం విడుదల‌వుతోంది. రిలీజ్ సంద‌ర్భంగా చిత్ర‌యూనిట్ హైద‌రాబాద్ ఫిలింఛాంబ‌ర్ లో పాత్రికేయుల‌తో ముచ్చ‌టించింది.

    వివరాల్లోకి వెళితేజజ

    యువతరం మెచ్చే చిత్రంగా

    యువతరం మెచ్చే చిత్రంగా

    నిర్మాత‌లు మామిడాల శ్రీనివాస్, దుగ్గివలస శ్రీనివాస్ మాట్లాడుతూ... యువతరం మెచ్చే అన్ని హంగులు ఉన్న చిత్రమిది . వీకెండ్‌ పార్టీలు యువతకు మంచి చేస్తున్నాయా? చెడు చేస్తున్నాయా? అనే పాయింట్‌ చుట్టూ ఉన్న కథాంశంతో ఈ సినిమా ఉంటుంది. కన్నడలో ఛమ్మక్‌ పేరుతో విడుదలైన ఈ చిత్రం దాదాపు 30 కోట్లు వసూలు చేసింది. మంచి చిత్రాన్ని అందరూ చూడాలనే వాయిదా వేసి మే 3న విడుదల చేస్తున్నాం. డ‌బ్బింగ్ సినిమా అయినా స్ట్రెయిట్ చిత్రంగా దీనిని ప్ర‌మోష‌న్ చేస్తున్నాం`` అని తెలిపారు.

    మంచి కంటెంట్ ఉన్న చిత్రంగా

    మంచి కంటెంట్ ఉన్న చిత్రంగా

    నిర్మాత స‌త్యారెడ్డి మాట్లాడుతూ.. భారీ క్రేజుతో వ‌స్తున్న ఈ చిత్రం పెద్ద విజ‌యం సాధించాలి. చ‌క్క‌ని కంటెంట్ ఉన్న చిత్ర‌మిది. నిర్మాత‌ల‌కు లాభాలు రావాలి`` అన్నారు. రామ స‌త్య‌నారాయ‌ణ మాట్లాడుతూ -``సినిమా తీయ‌డ‌మే కాదు రిలీజ్ చేయ‌డంలో చ‌క్క‌ని ప్ర‌ణాళిక‌లు ఉండాలి. నిర్మాత‌లు పంపిణీ రంగంలో అనుభ‌వ‌జ్ఞులు. అవెంజ‌ర్స్ వ‌ల్ల వాయిదా వేసి స‌రైన టైమ్‌లో రిలీజ్ చేస్తున్నారు`` అని అన్నారు.

    నిర్మాతకు రష్మిక బంగారు బాతు

    నిర్మాతకు రష్మిక బంగారు బాతు

    సాయి వెంక‌ట్ మాట్లాడుతూ.. మే 3న రిలీజ‌వుతున్న ఈ చిత్రం పెద్ద విజ‌యం సాధించాలి. ర‌ష్మిక క్రేజుకు త‌గ్గ‌ట్టే విజ‌యం ద‌క్కించుకుంటుంది. ఆల్ ది బెస్ట్`` అన్నారు. స‌మ‌ర్ప‌కుడు దివాక‌ర్‌ మాట్లాడుతూ - ``గీత గోవిందంతో 100 కోట్ల క్ల‌బ్ నాయిక‌గా ర‌ష్మిక నిర్మాత‌ల బంగారు బాతులా మారారు. త‌ను నంబ‌ర్ వ‌న్ స్థాయిలో ఉన్నారు. గీతా ఛ‌లో పెద్ద విజ‌యం సాధిస్తుంది`` అన్నారు.

    కన్నడలో పెద్ద హిట్ అయింది

    కన్నడలో పెద్ద హిట్ అయింది

    బెక్కం వేణు గోపాల్ మాట్లాడుతూ.. డ‌బ్బింగ్ సినిమాలు ఎన్నో వ‌స్తుంటాయి. అయితే అభిరుచితో తెచ్చే చిత్రాలు విజ‌యం సాధిస్తాయి. క‌న్న‌డ‌లో పెద్ద హిట్ట‌యిన చిత్రాన్ని తెలుగులో రిలీజ్ చేస్తున్నారు`` అన్నారు. సురేష్ కొండేటి మాట్లాడుతూ- ``రెండు బ్లాక్ బ‌స్ట‌ర్ టైటిల్స్ ని పెట్టుకుని వ‌స్తున్న చిత్ర‌మిది. అవెంజ‌ర్స్ లాంటి సునామీ ముందు రిలీజ్ చేయ‌కుండా వాయిదా వేయ‌డం మంచికే. మే 3న‌ ఎక్కువ థియేట‌ర్ల‌లో రిలీజ‌వుతోంది.. విజ‌యం సాధించాలి..`` అన్నారు.

    బ్లాక్‌బస్టర్ టైటిల్స్‌తో

    బ్లాక్‌బస్టర్ టైటిల్స్‌తో

    శోభా రాణి మాట్లాడుతూ - ``మామిడాల శ్రీ‌నివాస్ చాలా కాలంగా ప‌రిశ్ర‌మ‌లో ఎంతో స‌న్నిహితులు. సినిమా విజ‌యానికి టైటిల్ ముఖ్యం. గీత గోవిందం .. ఛ‌లో లాంటి బ్లాక్‌బ‌స్ట‌ర్ టైటిల్స్‌ని క‌లిపి గీతా ఛ‌లో అనే టైటిల్ పెట్టారు. అంత పెద్ద హిట్ట‌వ్వాలి`` అన్నారు. బాలాజీ నాగ‌లింగం.. స‌హా ప‌లువురు అతిధులు ఈ సినిమా పెద్ద విజ‌యం సాధించాల‌ని ఆకాంక్షించారు.

    English summary
    Kannada sensationa hit Chammak is releasing in telugu as Geeta Chalo. This Audio release function held in Hyderabd. RP Patnaik, C Kalyan, VN Aditya and others are chief guest for this function.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X