అల.. వైకుంఠపురములో హిందీ రీమేక్.. హీరో హీరోయిన్ ఫిక్స్, గీత ఆర్ట్స్ బడా ప్లాన్!
టాలీవుడ్ ఇండస్ట్రీలో బాహుబలి అనంతరం తెలుగులో అత్యదిక వసూళ్లను అందుకున్న చిత్రం అల.. వైకుంఠపురములో. ఈ సినిమా ఆ స్థాయిలో విజయాన్ని అందుకుంటుందని మొదట ఎవరు ఊహించలేదు. ఇక సినిమాను హిందీలో కూడా రీమేక్ చేయడానికి సిద్ధమైనట్లు తెలుస్తోంది. అందుకు సంబంధించిన న్యూస్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. రీసెంట్ గా గీతా ఆర్ట్స్ హీరో హీరోయిన్ విషయంలో ఒక నిర్ణయానికి వచ్చినట్లు సమాచారం.

హ్యాట్రిక్ హిట్
అల్లు అర్జున్ - త్రివిక్రమ్ కాంబినేషన్ పై టాలీవుడ్ లో అంచనాలు ఏ రేంజ్ లో ఉంటాయో స్పెషల్ గా చెప్పనవసరం లేదు. మొదట చేసిన జులాయితో ట్రెండ్ సెట్ చేసి ఆ తరువాత సన్ ఆఫ్ సత్యమూర్తి సినిమాతో మరొక బాక్సాఫీస్ హిట్ అందుకున్నారు. ఇక అల..వైకుంఠపురములో కూడా బిగెస్ట్ హిట్ గా నిలిచింది.

స్టోరీ హక్కుల కోసం..
అల.. వైకుంఠపురములో దాదాపు 260కోట్ల వరకు బిజినెస్ చేసి నిర్మాతలకు బయ్యర్లకు మంచి లాభాలను అందించింది. కేవలం థియేట్రికల్ గానే కాకుండా డిజిటల్ రైట్స్ లలో కూడా నిర్మాతకు మంచి ప్రాఫిట్స్ వచ్చాయి. అయితే సినిమాను రీమేక్ చేయాలని బాలీవుడ్ ఇండస్ట్రీలో కొంతమంది హీరోలు గత ఏడాది చర్చలు బాగానే జరిపారు. స్టోరీ హక్కుల కోసం పోటీ పడినప్పటికి గీతా ఆర్ట్స్ ఎవరికి దక్కనివ్వలేదు.

కార్తిక్ ఆర్యన్ - కృతి సనోన్
ఇక తెలుగులో అల్లు అర్జున్ చేసిన ఆ పాత్రకు ఎవరు న్యాయం చేస్తారని అనుకుంటున్న తరుణంలో గతంలో చాలా పేర్లు వినిపించాయి. ఇక ఫైనక్ గా కార్తిక్ ఆర్యన్ ను ఫిక్స్ చేసినట్లు సమాచారం. ఇక తెలుగులో పూజా హెగ్డే హీరోయిన్ గా నటించగా ఇప్పుడు హిందీలో కృతి సనోన్ ను ఫిక్స్ చేసినట్లు సమాచారం.

గీతా ఆర్ట్స్ ప్రొడక్షన్ లోనే..
ఒక బడా బాలీవుడ్ ప్రొడక్షన్ తో కలిసి గీతా ఆర్ట్స్ పై అల్లు అరవింద్ ఈ సినిమాను నిర్మించాలని అనుకుంటున్నాడట. ఇక త్రివిక్రమ్ శ్రీనివాస్ క్రియేట్ చేసిన మ్యాజిక్ ను బాలీవుడ్ లో ఏ దర్శకుడు క్రియేట్ చేస్తాడో చూడాలి. ఇక పరిస్థితులు కాస్త అడుపులోకి వచ్చిన తరువాత సినిమాను సెట్స్ పైకి తీసుకువచ్చే అవకాశం ఉందట. వచ్చే ఏడాది మొదట్లోనే సినిమాను రిలీజ్ చేయవచ్చని సమాచారం.


Click it and Unblock the Notifications











