twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    "సంపూర్ణరామాయణం" రిజిస్టర్ చేసారు, కానీ రాముడు రామ్ చరణ్ కాదు

    మరో ఇద్దరు నిర్మాతలతో కలిసి రామాయణం తీస్తానని అల్లు అరవింద్ చెప్పారు కానీ.. ఇప్పుడు మరో అడుగు ముందుకు పడింది.

    |

    పరిశ్రమలో అల్లు అరవింద్ కు చెందిన గీతా ఆర్ట్స్‌ సంస్థ కు ఓ ప్రత్యేకమైన గుర్తింపు. ఈ బ్యానర్ నుంచి వచ్చిన చిత్రాలు మెగా హిట్స్ అయ్యాయి. అయితే తమ సొంత కుటుంబ హీరోలతోనే ఈ బ్యానర్ లో సినిమాలు చేస్తూంటారు. తాజాగా ఈ బ్యానర్ పై మరో చిత్రం చేయటానికి సన్నాహాలు చేస్తున్నారు. అల్లుఅరవింద్ గీతా ఆర్ట్స్ బ్యానర్ లో ఇప్పటి వరకు ఎన్నో కమర్షియల్ సినిమాలు వచ్చాయి.ఈసారి రామాయణం సినిమా గా తియ్యాలని అనుకుంటున్నారు. ఈ సినిమాని భారీ బడ్జెట్ తో తియ్యాలని నిర్ణయంతో సంచలం సృష్టించారు అరవింద్.

    మరో అడుగు ముందుకు

    మరో అడుగు ముందుకు

    మలయాళంలో మోహన్ లాల్ తో మహా భారత్.. తెలుగులో అల్లు అరవింద్ తీస్తానన్న రామాయణం.. తమిళంలో సంఘమిత్ర.. ఇలాంటి బాపతే. అయితే.. మరో ఇద్దరు నిర్మాతలతో కలిసి రామాయణం తీస్తానని అల్లు అరవింద్ కొన్నాళ్ళ కిందే చెప్పారు .. ఇప్పుడు మరో అడుగు ముందుకు పడింది.

    సంపూర్ణ రామాయణం

    సంపూర్ణ రామాయణం

    'సంపూర్ణ రామాయణం' అనే టైటిల్ ను గీతా ఆర్ట్స్ బ్యానర్ పై రిజిస్ట్ చేయించేశారు. అంటే.. ఈ ప్రాజెక్ట్ ఖచ్చితంగా ఉంటుందన్న మాట. అయితే.. ఇంతకీ రాముడుగా ఎవరు నటిస్తారనే విషయంపై నిర్మాతల నుంచి క్లారిటీ లేదు కానీ.. మెగా ఫ్యాన్స్ మాత్రం మా రామ్ చరణే శ్రీరాముడు అంటూ తెగ హంగామా చేసేస్తున్నారు..

    గౌతమీ పుత్ర శాతకర్ణి

    గౌతమీ పుత్ర శాతకర్ణి

    బాహుబలి వచ్చిన దగ్గరినుంచీ ఈ తరహా పౌరాణిక, జానపద కథలమీద అందరికీ దృష్టి మళ్ళింది, అదే సందర్భం లో వచ్చిన గౌతమీ పుత్ర శాతకర్ణి కూడా మరింత నమ్మకం పెంచింది,బాహుబలి ఈ ఒక్క సినిమా ఇండియన్ సినీ ఇండస్ట్రీ రూపాన్నే మార్చేసింది. సినిమా మార్కెట్ లో ఒక విప్లవం వచ్చింది.

    భారీ క‌స‌ర‌త్తు మొద‌లైంది

    భారీ క‌స‌ర‌త్తు మొద‌లైంది

    ఈ సినిమా ఇచ్చిన స్ఫూర్తితో దర్శకనిర్మాతలు భారీ చిత్రాలకు శ్రీకారం చుడుతున్నారు. ఏకంగా రూ.500 కోట్ల‌తో ఓ చిత్రం రూపొంద‌నుంది. అదీ మ‌న తెలుగులో. రామాయ‌ణ గాథ‌ని వెండి తెర‌పై ఆవిష్క‌రించ‌డానికి ఓ భారీ క‌స‌ర‌త్తు మొద‌లైంది. ఈ ప్రాజెక్టులో అల్లు అర‌వింద్, మ‌ధు మంతెన‌, న‌మిత్ మ‌ల్హోత్రా భాగ‌స్వాములు కాబోతున్నారు.

    అక్టోబర్‌లో సెట్స్‌మీదకు

    అక్టోబర్‌లో సెట్స్‌మీదకు

    త్వరలో ఈ సినిమాకు సంబంధించిన ప్రధాన తారాగణం, సాంకేతిక నిపుణుల బృందాన్ని ప్రకటించబోతున్నారు. అక్టోబర్‌లో ఈ చిత్రాన్ని సెట్స్‌మీదకు తెచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఇప్పుడు సినిమాకి సంబంధించి ఓ అభిమాని రామాయణం పోస్టర్ లో రామ్ చరణ్ ని రాముడిగా చిత్రించి. సోషల్‌ మీడియాలో వదిలేశాడు.

    రామ్ చరణ్ రాముడు

    రామ్ చరణ్ రాముడు

    వాస్త‌వానికి రామాయ‌ణం సినిమాలో క్యాస్టింగ్ గురించి అల్లు అర‌వింద్ అండ్ కో ఇప్ప‌టికే ఆలోచ‌న ప్రారంభించింది. అయితే రామ్ చరణ్ రాముడు అన్న టాక్ కూడా నిజం కాదన్న మాట కూడా వినిపిస్తోంది. ఇప్పటికి వినిపిస్తున్న టాక్ ప్రకారం . తొల‌ుత టాలీవుడ్ లోని ప్ర‌ధాన తారాగ‌ణంలో నుంచే రాముణ్ణి, రావ‌ణాసుడినీ ఎంచుకోవాల‌ని అనుకున్నా..ఆ పాత్ర గొప్ప‌త‌నానికి స‌రితూగే, న్యాయం చేసే ముఖాలు మ‌న ఇండ‌స్ట్రీలో క‌న‌బ‌డ‌లేద‌ట‌..

    న్యాయం చేయ‌గ‌ల న‌టుల కోసం

    న్యాయం చేయ‌గ‌ల న‌టుల కోసం

    ఒక వేళ బాలీవుడ్ నుంచి ఎర్ర‌తోలు కుర్రాణ్ణి ఎర‌ర్నైనా ప‌ట్టుకొద్దామంటే ఇదిగో మ‌న రాఘ‌వేద్ర‌రావు న‌మో వెంక‌టేశాయ‌లో వెంక‌టేశ్వ‌ర స్వామిలాగా తేలిపోతార‌నే భ‌యం ప‌ట్టుకుంది. అందుకే తెలుగులోనే రాముడు, సీత క్యారెక్ట‌ర్‌ల‌కు పాత్రల‌కు న్యాయం చేయ‌గ‌ల న‌టుల కోసం అన్వేషిస్తున్నారట‌.

    English summary
    Geetha Arts that recently announced to make a film based on Ramayanam has registered a title as 'Sampoorna Ramayanam'. So, it seems the project is really taking place.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X