గీత గోవిందం ఆడియో వేడుక.. చీఫ్ గెస్ట్‌గా అల్లు అర్జున్!
యువ హీరో విజయ్ దేవరకొండ నటిస్తున్న తాజా చిత్రం గీత గోవిందం. రష్మిక మందన హీరోయిన్. ఇటీవలే విడుదలైన టీజర్ సినిమాపై మరింతగా ఆసక్తిని పెంచింది. పూర్తి స్థాయి వినోదాత్మక చిత్రంగా గీత గోవిందం తెరకెక్కుతోంది. గీత ఆర్ట్స్ 2 పతాకంపై బన్నీ వాసు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.
శ్రీరస్తు శుభమస్తు ఫేమ్ పరశురామ్ ఈ చిత్రానికి దర్శకుడు. ఈ చిత్ర ఆడియో వేడుక జులై 29 జరగబోతోంది. ఆడియో వేడుకకు స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ముఖ్య అతిధిగా హాజరు కాబోతున్నాడు. కొద్దిసేపటి క్రితమే చిత్ర యూనిట్ ఈ విషయాన్ని ధృవీకరించింది.

అర్జున్ రెడ్డి చిత్రంతో విజయ్ దేవరకొండ యువతలో మంచి క్రేజ్ సొంతం చేసుకున్నాడు. టీజర్ గమనిస్తే విజయ్, రష్మిక మధ్య కెమిస్ట్రీ బాగా కుదిరినట్లు తెలుస్తోంది. అల్లు అర్జున్ ఆడియో వేడుకకు హాజరవుతుండడంతో ఈ చిత్రానికి మరింతగా ప్రాధాన్యత దక్కింది.
allu arjun vijay devarakonda geetha arts parasuram rashmika mandanna విజయ్ దేవరకొండ గీత ఆర్ట్స్ పరశురామ్


Click it and Unblock the Notifications