దెబ్బకు విజయ్ దేవరకొండ మీద పిచ్చి దిగిపోవాలి... డైరెక్టర్ కామెంట్స్!

By Bojja Kumar

Recommended Video

Geetha Govindam Director Parasuram Talks About Vijay Deverakonda

'అర్జున్ రెడ్డి' సినిమాతో విజయ్ దేవరకొండ తనకంటూ ప్రత్యేకమైన ఓ స్టార్‌డమ్ సంపాదించుకున్నారు. ఆ సినిమా ఎఫెక్టుతో విజయ్ దేవరకొండ అంటే ఒక మేనియా, పిచ్చి తయారైంది. అయితే 'గీతా గోవిందం' సినిమా తర్వాత ఆ పిచ్చి దిగిపోతుంది అంటున్నారు దర్శకుడు పరశురామ్. ఆగస్టు 15న సినిమా విడుదలవుతున్న నేపథ్యంలో ఆయన మీడియాతో ముచ్చటించారు. అర్జున్ రెడ్డి సినిమాకు ఇది పూర్తి భిన్నమైన సినిమా అన్నారు.

 గీత గోవిందం అంటే..

గీత గోవిందం అంటే..

‘గీత గోవిందం' అంటే మహాభారతంలో శ్రీ కృష్ణుడికి, రాధకు మధ్య ఉండే ఎపిసోడ్. ఆ క్యారెక్టర్లు రిప్లెక్ట్ అవుతూ హీరో హీరోయిన్ల మధ్య లైఫ్ జర్నీ సాగుతుంది. ప్రేక్షకులు ఇంప్రెస్ అయ్యేలా సినిమా ఉంటుంది అన్నారు.

అర్జున్ రెడ్డి కంటే ముందే...

అర్జున్ రెడ్డి కంటే ముందే...

అర్జున్ రెడ్డి విడుదల కంటే ముందే ‘గీత గోవిదం' ఈ సినిమా అనుకున్నాం. పెళ్లి చూపులు తర్వాత అరవింద్ గారిని కలిసి కథ చెప్పినపుడు ఆయన ఎవరిని హీరోగా అంటే ఇలా విజయ్‌‌ని అనుకుంటున్నాను అన్నాను. ‘గీత గోవిందం' మొదలైన నాలుగైదు నెలలకు అర్జున్ రెడ్డి వచ్చిందని పరిశురామ్ తెలిపారు.

వర్జిన్ టాపిక్ ఉండదు, క్లీన్ ఫ్యామిలీ మూవీ

వర్జిన్ టాపిక్ ఉండదు, క్లీన్ ఫ్యామిలీ మూవీ

‘అర్జున్ రెడ్డి'లో ప్లే బాయ్ కల్ట్ రోల్... ఇందులో 25 వచ్చినా వర్జిన్... సినిమాలో హీరో పాత్ర ఎలా ఉండబోతోంది? అనే ప్రశ్నకు పరవురాం స్పందిస్తూ... సినిమాలో వర్జిన్ అనే టాపిక్ ఏమీ ఉండదు. గీత గోవిందం ప్రమోషన్లలో అలాంటి పోస్టర్లు వేయడానికి కారణం... ‘అర్జున్ రెడ్డి'లో చూపించిన క్యారెక్టరైజేషన్, ‘గీత గోవిందం' క్యారెక్టరైజేషన్ వేరు అని ఆడియన్స్‌ను ప్రిపేర్ చేయడానికే అలా చేశాం. అంతే కానీ సినిమాలో వర్జిన అనే టాపిక్ లేదు. క్లీన్ ఫ్యామిలీ చిత్రమని... పరశురామ్ తెలిపారు.

వివాదాలు అనవసరం అనుకున్నాం

వివాదాలు అనవసరం అనుకున్నాం

‘గీత గోవిందం' ఫస్ట్ సాంగ్ హిట్ అయింది.సెకండ్ సాంగ్ కాంట్రవర్సీ అయింది. వెంటనే ఆ పాటను తీయించేశాం. మాకు వివాదాలు అవసరం లేదనే ఈ నిర్ణయం తీసుకున్నాం. ఇప్పటికే సినిమాకు పాజిటివ్ బజ్ వచ్చింది. దాన్ని చెడగొట్టుకోవడం ఇష్టం లేకనే అలా చేశామని తెలిపారు.

విజయ్ మీద ఉన్న ఆ పిచ్చి దిగిపోతుంది

విజయ్ మీద ఉన్న ఆ పిచ్చి దిగిపోతుంది

ఇందులో హీరో క్యారెక్టర్ చాలా హంబుల్‌గా, మంచి ఫ్యామిలీ ఓరియెంటేషన్‌తో, డీసెంట్ లాంగ్వేజ్‌తో ఉంటుంది. అర్జున్ రెడ్డి తర్వాత విజయ్ దేవరకొండ మీద పిచ్చిగా ఉన్నదంతా ప్రేమగా కన్వర్ట్ అవుతుంది. అది విజయ్‌కు, సినిమాకు చాలా ప్లస్ అవుతుందని పరశురామ్ తెలిపారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X