గీత గోవిందం ఫస్ట్ లుక్..కాళ్ళు తిమ్మిరి ఎక్కినా రష్మిక కోసం భరిస్తున్నాడు!
విజయ్ దేవరకొండ, రష్మిక మందన జంటగా నటిస్తున్న చిత్రం గీత గోవిందం. గీత ఆర్ట్స్ బ్యానర్ లో ఈ చిత్రం రూపొందుతోంది. శ్రీరస్తు శుభమస్తు ఫేమ్ పరశురామ్ ఈ చిత్రానికి దర్శకుడు. విజయ్ దేవరకొండ నుంచి వస్తున్న మరో రొమాంటిక్ ప్రేమకథా చిత్రం ఇది. తాజగా విడుదల చేసిన ఈ చిత్ర ఫస్ట్ లుక్ పోస్టర్ యువతని ఆకట్టుకునే విధంగా ఉంది.
విజయ్ దేవరకొండ తన కాళ్ళని గోడకు తాకించి కూర్చుని ఉండగా అతడి కాళ్లపై రష్మిక తాపీగా కూర్చుని ఉంది. ఈ పోస్టర్ యువతని తెగ ఆకట్టుకుంటోంది. ఫస్ట్ లుక్ విడుదలైన కొద్దీ సేపటికే ఫస్ట్ లుక్ వైరల్ గా మారింది.

ఈ ఫస్ట్ లుక్ పై విజయ్ దేవరకొండ సరదాగా కామెంట్ చేసాడు. నా కాళ్ళు తిమ్మిరి ఎక్కినా, నడుం పట్టేసినా నీ బరువు బాధ్యత ఎప్పుడూ నాదే మేడం అంటూ సరదగా వ్యాఖ్యానించాడు. ప్రముఖ నిర్మాత ఈ చిత్రానికి సమర్పకుడిగా వ్యవహరిస్తున్నారు. త్వరలోనే గీత గోవిందం చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది.


Click it and Unblock the Notifications











