రూ. 100 కోట్ల ‘గీత గోవిందం’.... ముందు ఆ హీరోతో అనుకున్నారా?

By Bojja Kumar

విజయ్ దేవరకొండ హీరోగా పరశురాం దర్శకత్వంలో తెరకెక్కిన 'గీత గోవిందం' చిత్రం బాక్సాఫీసు వద్ద సంచలన విజయం అందుకున్న సంగతి తెలిసిందే. అప్పటికే 'పెళ్లి చూపులు', 'అర్జున్ రెడ్డి' సినిమాలతో మంచి గుర్తింపు తెచ్చుకున్న విజయ్ దేవరకొండ ఈ సినిమా భారీ విజయంతో స్టార్ హీరో స్టేటస్ సొంతం చేసుకున్నాడు.

ఎలాంటి సినిమా ఫ్యామిలీ బ్యాగ్రౌండ్ లేకుండా కేవలం టాలెంటును నమ్ముకుని రెండు మూడు సినిమాలకే ఈ స్థాయికి రావడం అనేది మామూలు విషయం కాదు. ఇలా ఎదగడం కేవలం విజయ్ దేవరకొండకే చెల్లిందని చెప్పక తప్పదు.

vijay

దర్శకుడు పరశురాం ఇంతకు ముందు అల్లు శిరీష్ హీరోగా 'శ్రీరస్తు శుభస్తు' సినిమా చేసిన సంగతి తెలిసిందే. ఆ సినిమా తర్వాత మరో మూవీ గీతా ఆర్ట్స్‌లోనే చేసే అవకాశం దక్కించుకున్నాడు. 'గీత గోవిందం' కథతో నిర్మాతలు అల్లు అరవింద్, బన్నీ వాస్ దగ్గరకి వెళ్లిపుడు వారు ఈ చిత్రాన్ని మొదట అల్లు శిరీష్ తో చేయాలనే ఆలోచనలో ఉన్నారట.

అయితే 'గీత గోవిందం' సినిమా విజయ్ దేవరకొండ లాంటి హీరోతో చేస్తే బాగా వర్కౌట్ అవుతుందని చెప్పడంతో వారు కూడా కన్విన్స్ అయ్యారని, వెంటనే అతడిని కాంటాక్ట్ అయి అగ్రిమెంట్ చేసుకున్నారని సమాచారం. ఆ తర్వాత విజయ్ నటించిన 'అర్జున్ రెడ్డి' భారీ విజయం అందుకోవడంతో 'గీత గోవిందం' నిర్మాతల్లో మరింత నమ్మకం ఏర్పడిందట. ఆ నమ్మకమే ఇపుడు నిజమై ఎవరూ ఊహించని విజయం సాధించి పెట్టింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X