ట్విట్టర్ రివ్యూ: విజయ్ దేవరకొండ, రష్మిక రొమాన్స్ కేక.. గీత గోవిందం ఎలా ఉందంటే!
Recommended Video

గత కొన్ని రోజులుగా టాలీవుడ్ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారిన చిత్రం గీత గోవిందం. విజయ్ దేవరకొండ, రష్మిక మందన జంటగా నటించిన ఈ చిత్రంపై యువతలో విపరీతమైన క్రేజ్ ఉంది. ట్రైలర్ ఆకట్టుకోవడం, పాటలకు మంచి రెస్పాన్స్ రావడంతో యూత్ ఈ చిత్రం కోసం ఎదురుచూస్తున్నారు. ఆగష్టు 15 స్వాతంత్ర దినోత్సవ సందర్భంగా ఈ చిత్రం నేడు ప్రేక్షకుల ముందుకు రానుంది. గీతా ఆర్ట్స్ బ్యానర్ లో శ్రీరస్తు శుభమస్తు ఫేమ్ పరశురామ్ ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. బన్నీ వాసు, అల్లు అరవింద్ నిర్మాతలు. ప్రీమియర్ షోలని బట్టి ఆడియన్స్ రెస్పాన్స్ ఎలా ఉందొ చూద్దాం.
అదరగొట్టారు
గీత గోవిందం చిత్రం చాలా బావుంది. ముఖ్యంగా విజయ్ దేవరకొండ, రష్మిక అదరగొట్టారు. తప్పక చూడాల్సిన చిత్రం.
వెన్నెల కిషోర్ కామెడీ
చివర్లో వెన్నెల కిషోర్ కామెడీతో అదరగొట్టాడు. ఆ సన్నివేశం సెకండ్ హాఫ్ లో హైలైట్ గా నిలుస్తుంది.
రొటీన్
రొటీన్ కథే. కానీ బావుంది. రష్మిక, విజయ్ బాగా చేశారు.
మరో సూపర్ స్టార్
ఇప్పుడే గీత గోవిందం చిత్రం చూసా. విజయ్ దేవరకొండ అదరగొట్టాడు. అతడు తెలుగు సినిమాకి మరో సూపర్ స్టార్ అనిపిస్తోంది.
కెమిస్ట్రీ అదుర్స్
రష్మిక, విజయ్ దేవరకొండ మధ్య కెమిస్ట్రీ అదిరిపోయింది. ఫస్ట్ హాఫ్ చాలా బావుంది. సెకండ్ హాఫ్ కూడా ఒకే. తప్పకుండ బ్లాక్ బస్టర్ చిత్రం అవుతుంది.
వినోదాత్మక
ఈ మధ్య కాలంలో వచ్చిన మంచి వినోదాత్మక చిత్రం గీత గోవిందం. విజయ్, రష్మిక నటన బావుంది.
యావరేజ్
గీత గోవిందం చిత్రం యావరేజ్ గా ఉంది. అక్కడక్కడా కామెడీ బావుంది. కొన్ని సన్నివేశాలు బావున్నాయి.
వాళ్ళిద్దరి
గీత గోవిందం చిత్రం యావరేజ్ మూవీ. కానీ రష్మిక, విజయ్ మధ్య రొమాన్స్ తో హిట్ చిత్రంగా మారుతుంది. మరో వారం వరకు ఈ చిత్రానికి తిరుగులేదు.
అదే కాపాడాలి
గీత గోవిందం చిత్రం ఆశించిన స్థాయిలో లేదు. యావరేజ్ చిత్రం. విజయ్ దేవరకొండ ఇమేజ్, చిత్రంపై ఉన్న హైప్ సినిమాని కాపాడాలి.
సూపర్ హిట్
గీత గోవిందం చిత్రానికి ఓవర్సీస్ నుంచి సూపర్ హిట్ రిపోర్ట్స్ వస్తున్నాయి.


Click it and Unblock the Notifications











