25 మంది హీరోయిన్లు విజయ్ దేవరకొండను రిజక్ట్ చేశారట!
విజయ్ దేవరకొండ హీరోగా పరశురాం దర్శకత్వంలో తెరకెక్కిన 'గీత గోవింతం' చిత్రం స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా విడుదలై సూపర్ పాజిటివ్ టాక్ సొంతం చేసుకుంది. విజయ్ కెరీర్లో అర్జున్ రెడ్డిని మించిన హిట్ అవుతుందనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. నిన్నటి వరకు సీనిమా సీన్లు లీకైన బాధలో ఉన్న చిత్ర యూనిట్... సూపర్ హిట్ టాక్ రావడంతో ఆనందంలో మునిగిపోయారు. విజయానందంలో ఉన్న దర్శకుడు పరశురాం ఓ ఆసక్తికర విషయం వెల్లడించారు. ఈ సినిమా మొదలు పెట్టినపుడు విజయ్‌తో చేయడానికి ఏ హీరోయిన్ ముందుకు రాలేదట.

25 మంది హీరోయిన్లు రిజక్ట్ చేశారు
‘అర్జున్ రెడ్డి' సినిమా విడుదల కంటే ముందే ‘గీత గోవిందం' మూవీకి విజయ్ సైన్ చేశాడు. ఈ చిత్రంలో హీరోయిన్‌గా దర్శకుడు చాలా మందిని అప్రోచ్ అయ్యాడట. దాదాపు 25 మంది హీరోయిన్లు అప్పటికీ పెద్దగా గుర్తింపు లేని విజయ్‌తో చేయడానికి నో చెప్పారట. అందులో పలువురు స్టార్ హీరోయిన్లు సైతం ఉన్నట్లు టాక్.

‘అర్జున్ రెడ్డి' తర్వాత పెరిగిన క్రేజ్
‘అర్జున్ రెడ్డి' సినిమా తర్వాత విజయ్ రేంజ్ ఒక్కసారిగా పెరిగిపోయింది. యూత్ క్రేజీ హీరోగా మారిపోయాడు. తాజాగా విడుదలైన ‘గీత గోవిందం' బ్లాక్ బస్టర్ టాక్ రావడంతో అప్పుడు వద్దన్న హీరోయిన్లే ఇకపై విజయ్‌తో చేసే అవకాశం అస్సలు వదులుకోరు అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు.

సూపర్ పాజిటివ్ టాక్
‘గీత గోవిందం' చిత్రం సూపర్ పాజిటివ్ టాక్ సొంతం చేసుకుంది. ఇటు యూత్ ఆడియన్స్‌తో పాటు ఫ్యామిలీ ప్రేక్షకులు ఇష్టపడే అంశాలతో సినిమా సూపర్‌గా ఉందని అంటున్నారు. ఈ చిత్రానికి వస్తున్న పాజిటివ్ టాక్ చూస్తుంటే మినిమమ్ రూ. 50 కోట్లు ఈజీగా కలెక్ట్ చేస్తుందని ట్రేడ్ విశ్లేషకులు అంటున్నారు.

విజయ్ వరుస సినిమాలు
అర్జున్ రెడ్డి విడుదదలైన దాదాపు సంవత్సరం తర్వాత విజయ్ రెండో మూవీ ‘గీత గోవిందం' వచ్చింది. అయితే ఇకపై అతడు నటించిన చిత్రాలు వరుసగా విడుదల కానున్నాయి. టాక్సీవాలా, నోటా, డియర్ కామ్రేడ్ చిత్రాలు కొన్ని నెలల గ్యాపుతో ఇక ప్రేక్షకుల ముందుకు రానున్నాయి.


Click it and Unblock the Notifications











