అమ్మాయిలు, ఆంటీలు అని తిరిగితే యాసిడ్ పోసేస్తా.. విజయ్ దేవరకొండకు వార్నింగ్!

Recommended Video

గీత గోవిందం టీజర్ : అమ్మాయిలు, ఆంటీలు అని తిరిగితే యాసిడ్ పోసేస్తా

అర్జున్ రెడ్డి చిత్రంతో విజయ్ దేవరకొండ క్రేజీ హీరోగా మారిపోయాడు. యువతలో విజయ్ దేవరకొండకు మంచి క్రేజ్ నెలకొంది. తాజాగా విజయ్ దేవరకొండ గీత గోవిందం చిత్రంలో నటిస్తున్నాడు. రష్మిక మందన హీరోయిన్. పరశురామ్ దర్శకత్వంలో ఈ చిత్రం తెరకెక్కుతోంది. తాజాగా విడుదలైన టీజర్ యువతని ఆకట్టుకునేలా ఉంది.

ఎన్నెన్నోజన్మల బంధం

ఎన్నెన్నోజన్మల బంధం

టీజర్ పాతకాలం సన్నివేశాలతో మొదలవుతుంది. విజయ్ దేవరకొండ రైతు గెటప్ లో ట్రాక్టర్ నడుపుకుంటూ ఎంట్రీ ఇస్తాడు. బ్యాక్ గ్రౌండ్ లో ఎన్నెన్నో జన్మల భందం నీది నాది అనే సాంగ్ ప్లే అవుతూ ఉంటుంది.

మత్తు వదులుతుంది

రష్మిక, విజయ్ దేవరకొండ భార్య, భర్తలుగా కనిపిస్తూ రొమాన్స్ లో మునిగితేలుతుంటారు. రష్మికకు విజయ్ దేవరకొండ ముద్దు పెట్టడానికి ప్రయత్నిస్తాడు. ఫట్ మని చెంపదెబ్బ సౌండ్.. కట్ చేస్తే విజయ్ దేవరకొండ ఊహల్లో విహరిస్తుండగా రష్మిక చెంపదెబ్బ కొట్టి మత్తు వదిలేలా చేస్తుంది. ఇక్కడి నుంచి అసలు టీజర్ మొదలవుతుంది.

అమ్మాయిలు, ఆంటీల చుట్టూ తిరిగితే

అమ్మాయిలు, ఆంటీల చుట్టూ తిరిగితే

ఇక్కడి నుంచి విజయ్ దేవరకొండ క్యారెక్టర్ బయట పడుతుంది. ఇంకొకసారి అమ్మాయిలు, ఆంటీలు, ఫిగర్లు అంటూ తిరిగితే యాసిడ్ పోసేస్తా అని రష్మిక విజయ్ దేవరకొండకు వార్నింగ్ ఇస్తుంది. ఆ డైలాగ్ చాలా బావుంది.

యువతని ఆకట్టుకునేలా

యువతని ఆకట్టుకునేలా

విజయ్ దేవరకొండ నటించిన మరో యూత్ ఫుల్ ఎంటర్ టైనర్ గీత గోవిందం. రష్మిక ఎప్పటిలాగే చలాకి అమ్మాయిగా ఈ చిత్రంలో నటిస్తోంది. శ్రీరస్తు శుభమస్తు చిత్రంతో మాయ చేసిన పరశురామ్ దర్శకత్వంలో ఈ చిత్రం రూపొందుతోంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X