గీత గోవిందం ప్రీలుక్.. జై బాలయ్య అంటున్న హీరోయిన్!
యంగ్ హీరో విజయ్ దేవరకొండ మరో చిత్రాన్ని షురూ చేశాడు. ప్రతిష్టాత్మకమైన గీతా ఆర్ట్స్ బ్యానర్ లో చిత్రం రూపొందుతోంది. ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ ఈ చిత్రాన్ని సమర్పిస్తున్నారు. నిన్ననే ఈ చిత్ర టైటిల్ గీత గోవిధం అని ప్రకటించారు. కాగా నేడు ప్రీ లుక్ విడుదల చేశారు.
ప్రీలుక్ ఆకట్టుకునే విధంగా ఉంది. విజయ్ దేవరకొండ నుంచి రాబోతున్న మరో రొమాంటిక్ మూవీ ఇది. శ్రీరస్తు శుభమస్తు ఫేమ్ పరశురామ్ ఈ చిత్రానికి దర్శకుడు. యంగ్ బ్యూటీ రష్మిక మందన హీరోయిన్ గా నటిస్తోంది.

గీతని ఎలా ఇంప్రెస్ చేయాలి అనే బుక్ ని విజయ్ దేవరకొండ చదువుతున్నట్లు, గోవింద్ ని ఎలా ఇంప్రెస్ చేయాలి అనే బుక్ ని రష్మిక చదువుతున్నట్లు ఫన్నీగా ప్రీ లుక్ డిజైన్ చేశారు. హీరోయిన్ చేతిపై జై బాలయ్య అనే టాటూ కూడా ఉండడం విశేషం. అంటే ఈ చిత్రంలో రష్మిక బాలయ్య అభిమానిగా నటిస్తుందేమో. జూన్ 23 శనివారం రోజు ఫస్ట్ లుక్ విడుదల కానుంది. బన్నీ వాసు ఈ చిత్రానికి నిర్మాత.


Click it and Unblock the Notifications











