‘గీత గోవిందం’: రిలీజ్ ముందే లీక్ ... పది మందిపై కేసులు!

geeta govindam, vijay devarakonda, rashmika mandanna, parasuram, గీతా గోవిందం, విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న, పరుశురాం

By Bojja Kumar

విజయ్ దేవరకొండ, రష్మిక మందన హీరో హీరోయిన్లుగా పరశురామ్ దర్శకత్వంలో గీతాఆర్ట్స్ 2 నిర్మించిన 'గీత గోవిందం' చిత్రానికి ఊహించని షాక్ తగిలింది. ఈ నెల 15న సినిమా విడుదలవుతుండగా సినిమాలో కొంతభాగం బయటకు లీక్ అయింది. గతంలో 'అత్తారింటికి దారేది' సినిమా విషయంలో జరిగినట్లే ఈ సినిమాకు రిలీజ్ ముందే బయకు లీక్ అవ్వడం సంచనం సృష్టించింది. దీనిపై వెంటనే పోలీసులు రంగంలోకి దిగారు. పలువురు ఇంజనీరింగ్ విద్యార్థులను అదుపులోకి తీసుకున్నారు.

వారే దీన్ని లీక్ చేశారు

వారే దీన్ని లీక్ చేశారు

పోలీసుల విచారణలో గుంటూరు సమీపంలోని రెండు ప్రైవేటు ఇంజనీరింగ్ కళాశాలల్లో చదువుతున్న విద్యార్థులు సినిమాలోని కొంత భాగాన్నీ లీక్ చేసినట్లు గుర్తించారు. వెంటనే వారిని అదుపులోకి తీసుకుని విచారించారు.

ఎలా లీకైంది?

ఎలా లీకైంది?

హైదరాబాద్‌లో ఎడిటింగ్ రూమ్ నుండే సినిమా లీకైనట్లు పోలీసులు తేల్చారు. ఓ వ్యక్తి ఈ సీన్లను ఎడిటింగ్ రూములో కాపీ చేసి తన మిత్రులకు పంపాడనీ, వారి నుంచి అవి ఇంజనీరింగ్ కాలేజీ విద్యార్థులకు చేరాయని తేలింది.

సీరియస్‌గా దర్యాప్తు

సీరియస్‌గా దర్యాప్తు

ఈ కేసును గుంటూరు అర్బన్ ఎస్పీ విజయరావు ప్రత్యేక దర్యాప్తునకు ఆదేశించారు. దీంతో పోలీసులు ఈ కేసును సీరియస్‌గా తీసుకున్నారు. ప్రధాన నిందితుడితో పాటు 10 మంది ఇంజనీరింగ్ విద్యార్థులను అదుపులోకి తీసుకుని పెదకాకాని పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు చేశారు.

గీత గోవిందం

గీత గోవిందం

అర్జున్‌రెడ్డి చిత్రం ఓవర్‌నైట్ స్టార్ అయిన విజ‌య్‌దేవ‌ర‌కొండ హీరోగా, ర‌ష్మిక మందన్న జంట‌గా ప‌రుశురాం ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కుతున్న చిత్రం " గీత గోవిందం". బ‌న్నీవాసు నిర్మాణంలో ప్రముఖ నిర్మాత శ్రీ అల్లు అర‌వింద్ స‌మ‌ర్ప‌ణ‌లో జీఏ2 పిక్చర్స్ బ్యాన‌ర్‌లో ఈ చిత్రాన్నినిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి గోపి సుంద‌ర్ సంగీతం. ఆగస్టు 15న సినిమా విడుదల కానుంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X