విజయ్ దేవరకొండ ‘వాట్ ది ఎఫ్’ పాటపై వివాదం... యూట్యూబ్ నుండి తొలగింపు!
Recommended Video

విజయ్ దేవరకొండ తను నటిస్తున్న తాజా చిత్రం 'గీతా గోవిందం' సినిమా కోసం స్వయంగా పాట పాడిన సంగతి తెలిసిందే. 'వాట్ ది ఎఫ్' అంటూ సాగే ఈ పాట గురువారం విడుదల చేయగా యూత్ నుండి మంచి రెస్పాన్స్ వచ్చింది. అదే సమయంలో ఈ పాటపై వివాదాలు రేగాయి. ఈ సాంగ్‌లోని లిరిక్స్ ఓ వర్గం ప్రజల మనోభావాలు దెబ్బతినేలా ఉన్నాయంటూ విమర్శలు వచ్చాయి. చివరకు ఈ వివాదం యూట్యూబ్ నుండి పాట తొలగించే వరకు వెళ్లినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం యూట్యూబులో 'ఈ వీడియో అందుబాటులో' లేదు అని దర్శనమిస్తోంది.

వివాదానికి కారణం ఏమిటి?
ఈ సాంగులో సీతా దేవి, సావిత్రి గురించి వచ్చిన లిరిక్స్ మీద కొందరు అభ్యంతరం వ్యక్తం చేయడమే ఈ వివాదానికి కారణమని తెలుస్తోంది. సినిమా రిలీజ్ దగ్గరపడుతున్న వేళ అనవసరమైన వివాదాలకు చోటు ఇవ్వకూడదనే ఉద్దేశ్యంతోనే ఈ పాటను తొలగించినట్లు చర్చించుకుంటున్నారు.

విజయ్ దేవరకొండ ట్విట్టర్ పేజీలో ఇలా..
విజయ్ దేవరకొండ నిన్న తన ట్విట్టర్ పేజీలో ఈ సాంగ్ పోస్టు చేశారు. నిన్న రాత్రి వరకే ఈ వీడియోకు దాదాపు 1 మిలియన్ వ్యూస్‌కు చేరువైంది. అయితే శుక్రవారం ఉదయం మాత్రం ఇలా... వీడియో అందుబాటులో లేదు అని దర్శనమిస్తోంది.

విజయ్ కెరీర్లో పాడిన తొలి పాట ఇదే
విజయ్ తన కెరీర్లో పాడిన తొలి పాట ఇది. మొదటి ప్రయత్నంలోనే ఇలాంటి అనుభవం ఎదురు కావడం విజయ్ అభిమానులను కాస్త నిరాశ పరిచింది అని చెప్పక తప్పదు.

ఆగస్టు 15 రిలీజ్
ప్రొడ్యూసర్ బన్నివాసు నిర్మాణంలో శ్రీ అల్లు అరవింద్ సమర్పణలో జిఏ2 పిక్చర్స్ పతాకంపై ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈనెల 29న ఈ చిత్రం ఆడియో రిలీజ్ ఫంక్షన్ ను గ్రాండ్ గా చేయనున్నారు. ఆగస్ట్ 15న స్వాతంత్ర్య దినోత్సవ కానుకగా వరల్డ్ వైడ్ గా రిలీజ్ చేయనున్నారు.


Click it and Unblock the Notifications











