బిగ్ బాస్ 2 ఫస్ట్ కంటెస్టెంట్‌గా ఎంటరైన గీతా మాధురి

By Bojja Kumar

Recommended Video

Bigg Boss Telugu Season 2 : Contestants Background

నాని హోస్ట్‌గా తెలుగు బిగ్ బాస్ సీజన్ 2 ఆదివారం రాత్రి 9 గంటలకు గ్రాండ్‌గా ప్రారంభమైంది. మొదటి సీజన్ సూపర్ హిట్ కావడం, మంచి ఎంటర్టెన్ అందించడం, సెకండ్ సీజన్లో... ఎన్టీఆర్ స్థానంలో నాని ఎంట్రీ ఇవ్వడం ఈ సారి షో ఎలా ఉండబోతోంది అనే ఆసక్తి అందరిలోనూ నెలకొని ఉంది. 16 మంది కంటెస్టెంట్లతో 106 రోజుల పాటు ఈ షో సాగబోతోంది. గత సీజన్ కంటే మరింత మసాలా దట్టించి తెలుగు రాష్ట్రాల ప్రేక్షకులను ఎంటర్టెన్ చేసేందుకు రంగం సిద్ధమైంది.

Geetha Madhuri

ప్లేబ్యాక్ సింగర్‌, డబ్బింగ్ ఆర్టిస్ట్ గీతా మాధురి బిగ్ బాస్ ఇంట్లోకి తొలి కంటెస్టెంటుగా ఎంట్రీ ఇచ్చారు. పక్కా లోకల్ పాట పాడుతూ ఆమె బిగ్ బాస్ హౌస్ లోకి ప్రవేశించారు. తెలుగులో ఐటం సాంగ్స్ పాడటంలో గీతా మాధురి ప్రత్యేక శైలి. తెలుగు నటుడు నందును గీతా మాధురి పెళ్లాడారు.

గీతా మాధురి తెలుగు సినిమాలలో అనేక శ్రావ్యమైన పాటలు పాడింది. నచ్చావులే(2008) సినిమాలో ఆమె పాడిన నిన్నే నిన్నే పాటతో ఎంతో ప్రాచుర్యం సంపాదించుకుంది. ఈ పాటకుగాను మొదటి నంది అవార్డు అందుకుంది. మాటీవిలో ప్రసారమైన సూపర్ సింగర్ అనే షో లో కూడా ఆమె పాల్గొంది.

గీతా మాధురి తల్లిదండ్రులు ప్రభాకర్, లక్ష్మిలకు ఆమె ఏకైక సంతానం. ఆమె తండ్రి ప్రభాకర్ ఎస్బీహెచ్ బ్యాంక్ లో పనిచేస్తున్నారు. వారిది గోదావరి ప్రాంతానికి చెందిన కుటుంబం. ఆమె చాలా చిన్న వయసులోనే హైదరాబాద్ కు మారిపోయారు. ఆమె ప్రాథమిక విద్య హైదరబాద్, వనస్థలిపురంలోని లయోలా పాఠశాలలో చదువుకున్నారు. చిన్నప్పట్నుంచే ఆమె సంగీతం అభ్యసించడం మొదలుపెట్టారు. లిటిల్ మ్యుజిషియన్స్ అకాడమీలో కచ్చర్లకోట పద్మావతి, రామాచారిల వద్ద చిన్న వయసు నుండే శాస్త్రీయ, సినీ, లలిత సంగీతాలలో శిక్షణ పొందారు గీత. ఈటీవిలో ప్రసారమైన "సై సింగర్స్ ఛాలెంజ్ "లో ఆమె ఫైనలిస్ట్ గా నిలిచింది.

గీతా 9 ఫిబ్రవరి 2014లో కథానాయకుడు ఆనంద కృష్ణ నందును నాగోల్ లో వివాహం చేసుకున్నారు. నందు 100% లవ్(2011) సినిమాలో ఆజిత్ గా ఆయన ప్రాచుర్యం పొందారు. వీరిద్దరూ కలసి అదితి అనే లఘు చిత్రం(షర్ట్ ఫిలిం)లో కథానాయకుడు, కథానాయికగా నటించారు.ఓ లఘుచిత్రంలో కలిసి నటించిన సందర్భంలో వీరిరువురి మధ్య ప్రేమ చిగురించింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X