»   » సింగర్ గీతామాధురి న్యూ అవతార్, ప్రియుడితో డాన్స్ (ఫోటోలు)

సింగర్ గీతామాధురి న్యూ అవతార్, ప్రియుడితో డాన్స్ (ఫోటోలు)

Subscribe to Filmibeat Telugu
For Quick Alerts
ALLOW NOTIFICATIONS
For Daily Alerts

  హైదరాబాద్: మన తెలుగు సినిమా ఇండస్ట్రీ వరకు మాట్లాడుకుంటే.......ఏమైనా స్టేజీ షోలు, అవార్డు కార్యక్రమాలు లాంటివి జరిగితే సింగర్లు పాటలు పాడుతూ ఉంటే, పక్కన డాన్సర్లు ఆ పాటలకు తగిన విధంగా స్టెప్స్ వేసే వారు. కానీ ఈ తరం సింగర్లు తమ రూటే సపరేటు అని నిరూపిస్తున్నారు. తాము పాటగాళ్లమే కాదు...ఆట గాళ్లం కూడా అంటూ జోరుగా స్టెప్స్ వేస్తున్నారు.

  తాజాగా సింగర్ గీతా మాధురి ఇటీవల జరిగిన ఓ కార్యక్రమంలో తన ప్రియుడు, కాబోయే భర్త నందుతో కలిసి స్టెప్స్ వేసి అందరినీ ఆశ్చర్య పరిచింది. గల్ఫ్ ఆంధ్రా మ్యూజిక్ అవార్డ్స్ ఇందుకు వేదికైంది. వీరి పెర్ఫార్మెన్స్ టోటల్ ఈ కార్యక్రమానికే హైలెట్‌గా మారింది. కొన్ని రోజుల క్రితం సింగర్ గీతా మాధురి, నటుడు నందు నిశ్చితార్థం జరిగిన సంగతి తెలిసిందే.

  గల్ఫ్ ఆంధ్రా మ్యూజిక్ అవార్డుల కార్యక్రమంలో గీతా మాధురి, నందుల పెర్ఫార్మెన్స్‌కు సంబంధించిన ఫోటోలు...

  నటిగా రాణించాలనే ప్లాన్లో గీతా మాధురి

  నటిగా రాణించాలనే ప్లాన్లో గీతా మాధురి


  గీతా మాధురి కేవలం ప్లేబ్యాక్ సింగర్‌గానే మిగిలి పోకుండా నటిగా కూడా రాణించాలనే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది.

  కాబోయేవాడి అండతో...

  కాబోయేవాడి అండతో...


  తనకు కాబోయే భర్త నందు నటుడు కావడంతో తను కూడా ఆ రంగం వైపు అడుగులు వేస్తోంది. ఇప్పటికే గీతా మాధురి-నందు కలిసి ఓ షార్ట్ ఫిల్మ్‌లో నటించినట్లు సమాచారం.

  వివాహం ఎప్పుడంటే?

  వివాహం ఎప్పుడంటే?


  గీతా మాధురి-నందు వివాహం 2014 ఫిబ్రవరి నెలలో జరిగే అవకాశం ఉంది. సినిమాలతో పాటు, బుల్లితెర కార్యక్రమాల్లో తన సింగింగ్ టాలెంటుతో అనేక మంది అభిమానులను సొంతం చేసుకుంది గీతా మాధురి.

  వివాహం లైవ్ కవరేజ్

  వివాహం లైవ్ కవరేజ్


  గీతా మాధురి నిశ్చితార్థం అనగానే బుల్లితెర ప్రేక్షకుల్లో ఆసక్తి నెలకొంది. దీన్ని గమనించిన పలు టీవీ ఛానల్స్ ఫిబ్రవరి నెలలో జరిగే ఆమె వివాహాన్ని లైవ్ కవర్ చేసేందుకు పోటీ పడుతున్నాయి.

  పబ్లిసిటీ పబ్లిసిటీ

  పబ్లిసిటీ పబ్లిసిటీ


  సినిమా రంగంలో ఉన్న వారు పబ్లిసిటీ కోసం పాకులాడటం సాధారణమే. ఎందుకంటే పబ్లిసిటీ పెరిగితేనే వారు ఎక్కువ కాలం పరిశ్రమలో మనుగడ సాధించగలుగుతారు. తాజాగా ప్రముఖ తెలుగు సింగర్ గీతా మాధురి పబ్లిసిటీ పెంచుకోవడానికి తనదైన రీతిలో ముందుకు సాగుతోంది.

  గల్ఫ్ ఆంధ్రా మ్యూజిక్ అవార్డ్స్

  గల్ఫ్ ఆంధ్రా మ్యూజిక్ అవార్డ్స్


  సింగర్ గీతా మాధురి ఇటీవల జరిగిన ఓ కార్యక్రమంలో తన ప్రియుడు, కాబోయే భర్త నందుతో కలిసి స్టెప్స్ వేసి అందరినీ ఆశ్చర్య పరిచింది. గల్ఫ్ ఆంధ్రా మ్యూజిక్ అవార్డ్స్ ఇందుకు వేదికైంది.

  English summary
  Geetha Madhuri and her Fiance Nandhu performed at Gulf Andhra Musical Awards 2013. Geetha Madhuri and actor Ananda Krishna Nandu have been doing rounds in the Tollywood circle for more than a year. Many in filmnagar were wondering as to know when they confirm their relationship. Finally, the actor-singer duo have put all the speculations to rest by getting engaged.
   

  తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

  X
  We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Filmibeat sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Filmibeat website. However, you can change your cookie settings at any time. Learn more