ప్రియుడితో సింగర్ గీతామాధురి చిలిపి చేష్టలు..(ఫోటోలు)
హైదరాబాద్: సింగర్ గీతా మాధురి నిశ్చితార్థం తన ప్రియుడు నందుతో సోమవారం హైదరాబాద్‌లో వైభవంగా జరిగిందిన సంగతి తెలిసిందే. ఎంగేట్మెంట్ సందర్భంగా ఈ ఇద్దరు ప్రేమపక్షులు రొమాంటిక్‌గా, చిలిపిగా ఫోటోలకు ఫోజులు ఇచ్చారు. అందుకు సంబంధించిన ఫోటోలు స్లైడ్ షోలో చూద్దాం...
నందు పలు ఇప్పటికే పలు చిత్రాల్లో నటించి నటుడిగా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. ఇక సింగర్ గీతా మాధురి గురించి, ఆమెకున్న పాపులారిటీ గురించి కొత్తగా చెప్పాల్సిన పని లేదు. ఇద్దరూ సినీ రంగానికి చెందిన వారే కావడంతో ఒకరినొకరు బాగా అర్ధం చేసుకున్నారు. ప్రేమించుకున్నారు. కొంతకాలం డేటింగ్ చేసారు. ప్రస్తుతం సాంప్రదాయ బద్దంగా పెద్దల అంగీకారంతో జీవితాన్ని పంచుకోబోతున్నారు.
వీరి వివాహం వచ్చే ఏడాది జరిగే అవకాశం ఉంది. త్వరలో పెళ్లి డేట్‌పై క్లారిటీ రానుంది. వీరిద్దరి మధ్య ఎంత ఘాటు ప్రేమ ఉందో ఈ క్రింది ఫోటోలు చూస్తే స్పష్టమవుతుంది.

ఎంగేజ్మెంట్ రింగ్స్
ఎంగేజ్మెంట్ సందర్భంగా సంప్రదాయం ప్రకారం జరిగే తంతు ఒకరికొకరు ఉంగరాల మార్పిడింది. తమ చేతి ఉంగరాలను చూపిస్తూ గీతా మాధురి-నందు

కళ్లలో ఆనందం
ఎంగేజ్మెంట్ అనంతరం ఇద్దరూ ఎంత ఆనందంగా ఏన్నారో వారి కళ్లలో ప్రస్సుటిస్తుంది కదూ....! వారి ఆహార్యం(వస్త్రధారణ) కూడా ఎంతో ఆకట్టుకునే విధంగా ఉంది.

చేతిలో చెయ్యేసి..
ఒకరి చేతిలో ఒకరు చేయ్యేసి కలకాలం కలిసి బ్రతుకుతాం.....అనే విధంగా సింబాలిక్‌గా ఉంది వీరి ఫోజు.

ఆమే..నా సర్వస్వం
నందు చూపులు, ఆయన కళ్లలో మెరుపు చూస్తుంటే ఆమె...నా సర్వస్వం అని తన ఎక్స్ ప్రెషన్స్ ద్వారా బెబుతున్నట్లు ఉంది కదూ ఈ ఫోటో

తన జ్ఞాపకార్థం
తన జ్ఞాపకార్థంగా కాబోయేవాడి చేతికి బ్రాస్‌లెట్ కడుతున్న దృశ్యాన్ని ఇక్కడ చూడొచ్చు. ఆమె తనకు సమీపంలో లేని సమయంలో దాన్ని చూసుసుకుని ఆమె జ్ఞాపకాల్లోకి వెళ్లడమే దీని వెనక ఉన్న అసలు అర్థం.

సినీ ప్రముఖులతో
ప్రముఖ సంగీత దర్శకుడు ఆర్.పి.పట్నాయక్‌తో కలిసి నంద, గీతా మాధురి. వీరితో పాటు ఈ కార్యక్రమానికి సినీ రంగానికి చెందిన నటులు, సింగర్లు, సంగీత దర్శకులు హాజరయ్యారు.

సినిమా ఫోజు..
ఈ ఫోటో చూస్తుంటే....ఎక్కడో ఏదో సినిమాలో సన్నివేశంలో చూసినట్లు ఉంది కదూ..

వావ్ రొమాంటిక్
ఈ స్టిల్ ఎంతో రొమాంటిక్‌గా ఉంది. ఇలా ఎంగేజ్మెంట్ పూర్తయిందో లేదు...అలా డ్యూయెట్ వేసుకున్నట్లు ఉంది ఈ ఫోజు.

అతిథులకు స్వాగతం
తమ ఎంగేజ్మెంట్‌కు వస్తున్న అతిథులకు సినిమా స్టైల్‌లో స్వాగతం చెబుతున్నట్లు ఉంది ఈ ఫోజు...

ముద్దబంతి రూపం
సింగర్ గీతా మాధురి అందంలో ముద్దబంతి రూపంలా ఉంటుందనడానికి నిదర్శనం ఈ ఫోటో....

ఆమె పెదాలు టచ్ చేస్తూ..
సో..రొమాంటిక్, నందు తనకు కాబోయే జీవిత భాగస్వామి గీతా మాధురి పెదాలు టచ్ చేస్తున్న సందర్భం.

అలసి సొలసి..ఐస్ క్రీం తింటూ
ఎంగేజ్మెంట్ సందర్భంగా అతిథులతో ఫోటోలకు ఫోజులిచ్చిన నందు, గీతా మాధురి...అలిసి సొలసి చివరకు ఇలా ఐస్ క్రీం తింటూ రిలాక్స్ అయ్యారు


Click it and Unblock the Notifications











