సింగర్ గీతా మాధురి పబ్లిసిటీ స్టంట్.. (వీడియో)
హైదరాబాద్: సినిమా రంగంలో ఉన్న వారు పబ్లిసిటీ కోసం పాకులాడటం సాధారణమే. ఎందుకంటే పబ్లిసిటీ పెరిగితేనే వారు ఎక్కువ కాలం పరిశ్రమలో మనుగడ సాధించగలుగుతారు. తాజాగా ప్రముఖ తెలుగు సింగర్ గీతా మాధురి పబ్లిసిటీ పెంచుకోవడానికి తనదైన రీతిలో ముందుకు సాగుతోంది.
ఇటీవలే తన ప్రియుడు, నటుడు నందుతో ఎంగేజ్మెంట్ జరుపుకున్న ఈ భామ......తమ ఎంగేజ్మెంట్ సెర్మనీని టీజర్ రూపంలో విడుదల చేసింది. ఇప్పటికే సోషల్ నెట్వర్కింగులో అనేక మంది అభిమానులను సొంతం చేసుకున్న గీతా మాధురి తన పరిధిని మరింత విస్తరించుకునే ప్రయత్నం చేస్తోంది.
గీతా మాధురి కేవలం ప్లేబ్యాక్ సింగర్‌గానే మిగిలి పోకుండా నటిగా కూడా రాణించాలనే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. తనకు కాబోయే భర్త నందు నటుడు కావడంతో తను కూడా ఆ రంగం వైపు అడుగులు వేస్తోంది. ఇప్పటికే గీతా మాధురి-నందు కలిసి ఓ షార్ట్ ఫిల్మ్‌లో నటించినట్లు సమాచారం.
గీతా మాదురి-నందు వివాహం 2014 ఫిబ్రవరి నెలలో జరిగే అవకాశం ఉంది. సినిమాలతో పాటు, బుల్లితెర కార్యక్రమాల్లో తన సింగింగ్ టాలెంటుతో అనేక మంది అభిమానులను సొంతం చేసుకున్న గీతా మాధురి నిశ్చితార్థం అనగానే బుల్లితెర ప్రేక్షకుల్లో ఆసక్తి నెలకొంది. దీన్ని గమనించిన పలు టీవీ ఛానల్స్ ఫిబ్రవరి నెలలో జరిగే ఆమె వివాహాన్ని లైవ్ కవర్ చేసేందుకు పోటీ పడుతున్నాయి. ఈ వేడుకకు పలువురు టాలీవుడ్ ప్రముఖులు హాజరవుతున్న నేపథ్యంలో తమ టీఆర్‌పీ రేటింగులు పెరుగుతాయని భావిస్తున్నారు.
గీతా మాధురి కూడా ఇందుకు సుముఖంగానే ఉన్నట్లు తెలుస్తుంది. అయితే ఎవరు ఎక్కువ డబ్బు ఇస్తే వారికే తన మ్యారేజ్ లైవ్ కవరేజ్ రైట్స్ ఇవ్వాలనే ఆలోచనలో ఉందట గీతా మాధురి. మరి ఎంత డబ్బు వస్తుందో? అనే విషయం ఇప్పుడు ఫిల్మ్ నగర్లో చర్చనీయాంశం అయింది.
<center><center><iframe width="100%" height="360" src="//www.youtube.com/embed/yokBiYEPPXk?feature=player_detailpage" frameborder="0" allowfullscreen></iframe></center></center>


Click it and Unblock the Notifications












