సింగర్ గీతా మాధురి తన భర్తను ఇంట్లోకి రానివ్వడం లేదా?

ఏమిటిదంతా అనుకుంటున్నారా. ఏమీ లేదండీ. ప్రస్తుతం 'ఆషాఢం' కదా. ఆషాడంలో అల్లుడు అత్తగారిని చూడకూడదనే సంప్రదాయం ఉన్న సంగతి తెలిసిందే. అందుకే తన భర్తను అస్సలు ఇంటికి రానివ్వడం లేదు గీతా మాధురి. అంతకు మించి ఇందులో సీరియస్‌గా తీసుకోవాల్సిన విషయం ఏమీ లేదు.
గీతా మాధురి, నందు వివాహం ఫిబ్రవరిలో జరిగింది. పెళ్లికి ముందు నుండే గీతా మాధురి, నందు ప్రేమించుకుంటున్నారు. వీరి మధ్య మొదలైన స్నేహం ప్రేమగా మారింది. ఇరు వర్గాల పెద్దలు అంగీకారంతో జీవిత భాగస్వాములయ్యారు. నటుడిగా ఇప్పుడిప్పుడే వెలుగులోకి వస్తున్న నందు శివనాగేశ్వరరావు దర్శకత్వం వహించిన 'ఫోటో' సినిమాతో తెరంగేట్రం చేసారు. ఇటీవల విడుదలైన 'ఆటో నగర్ సూర్య' చిత్రంలో కిచ్చా పాత్రలో నందు తన నటనతో ఆకట్టుకున్నాడు.


Click it and Unblock the Notifications











