సింగర్ గీతా మాధురి ‘షాడో’ ఐటం సాంగ్‌లో...!
హైదరాబాద్: సింగర్ గీతా మాధురి గురించి కొత్తగా పరిచయం అక్కర్లేదనుకుంటా. ఐటం సాంగుకులకు మంచి కిక్ ఇచ్చే వాయిస్‌తో పాటు, ఆకట్టుకునే రూపం ఆమె సొంతం. ఇప్పటి వరకు తెర వెనక పాటలు పాడటానికే పరిమితం అయిన గీతా మాధురి త్వరలో తెరపై ఐటం సాంగులో కనిపించబోతోంది.
అయితే ఆమె ఐటం సాంగులో అందాలు ఆరబోస్తూ సెక్సీ స్టెప్పులు వేస్తుందనుకుంటే పొరపాటే. వెంకటేష్ హీరోగా వస్తున్న షాడో చిత్రంలోని నాటీగర్ల్స్ అనే సాంగులో గీతా మాధురి సింగర్‌గా కనిపించబోతోంది. ఆమె మైక్ పట్టుకుని పాట పాడుతుంటే హీరోయిన్ తాప్సీ హాట్ అండ్ సెక్సీగా అందాలు ఆరబోస్తూ ప్రేక్షకులకు కనువిందు చేయనుంది.
మెహర్ రమేష్ దర్శకత్వం వహిస్తున్న షాడో చిత్రంలో వెంకీ సరసన తాప్సీ నటిస్తుండగా, శ్రీకాంత్‌కు జోడీగా మధురిమ చేస్తోంది. యునైటెడ్ మూవీస్ పతాకంపై సింహా నిర్మాత పరుచూరి కిరీటి ఈ చిత్రాన్ని ప్రొడ్యూస్ చేస్తున్నారు. యాక్షన్ థ్రిల్లర్‌గా రూపొందుతున్న ఈచిత్రానికి సక్సెస్ ఫుల్ రైటర్స్ కోన వెంకట్, గోపీ మోహన్‌లు స్క్రిప్టు అందిస్తున్నారు. ఉగాది సందర్భంగా ఏప్రిల్ 11న ఈ చిత్రం విడుదల కానుంది.
నాగబాబు, ధర్మవరపు సుబ్రహ్మణ్యం, ఎమ్మెస్ నారాయణ, జయప్రకాష్‌రెడ్డి, ఆదిత్యమీనన్, ముఖేష్‌రుషి, ప్రభు, సూర్య, ఉత్తేజ్, రావురమేష్ ఇతర పాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి కథ: కోనవెంకట్, గోపిమోహన్. మాటలు: కోనవెంకట్, మెహర్ రమేష్, సంగీతం: తమన్. కెమెరా: ప్రసాద్, మూరెళ్ల, ఎడిటింగ్, మార్తాండ్, కె.వెంకటేష్. ఆర్ట్: ప్రకాష్ ఏ ఎస్. ప్రొడక్షన్ కంట్రోలర్: పి. అజరుకుమార్ వర్మ, నిర్మాత: పరుచూరి కిరీటి, దర్శకత్వం: మెహర్ రమేష్.


Click it and Unblock the Notifications











