అది చూసినంత మంది ఇది చూస్తారా?.. ఆ విషయంలో చెప్పగలిగేది అదొక్కటే.. గీతా మాధురి అసహనం

గత కొన్ని రోజులుగా ఓ మహిళ చేసిన అత్యాచార ఆరోపణలు ఎంతగా వైరల్ అయ్యాయో అందరికీ తెలిసిందే. కొన్నేళ్లుగా 139 మంది ఐదు వేల సార్లు తనపై అత్యాచారం చేశారని, అందులో యాంకర్ ప్రదీప్ ఉన్నాడని, నటుడు కృష్ణుడు కూడా ఉన్నాడని ఆమె ఆరోపించింది. ఇక ఈ వార్తలు దావానంలా వ్యాప్తి చెందాయి. అత్యాచర ఆరోపణలపై ఆ ఇద్దరూ స్పందించారు. ఆ ఆరోపణలతో ఎటువంటి సంబంధం లేదని, అందులో ఏ మాత్రం నిజం లేదని ప్రదీప్, కృష్ణుడు ఖండించారు.

వార్తలపై ఫైర్..

వార్తలపై ఫైర్..

అత్యాచారం చేశారని ఆరోపించడం, వాటిలో నిజానిజాలు తెలుసుకోకుండా వార్తలను ప్రచురించడంపై యాంకర్ ప్రదీప్ ఫైర్ అయ్యాడు. ఏ మాత్రం ఆలోచించకుండా యాంకర్ ప్రదీప్ పేరు కనబడటంతో ఇష్టమొచ్చినట్టుగా వార్తలు రాయడమేనా, వ్యూస్ కోసం అలా చేస్తారా? అంటూ మీడియాపై ఆగ్రహం వ్యక్తం చేశాడు. మరో వైపు కృష్ణుడు కూడా మీడియాతో మాట్లాడుతూ ఆ వార్తలను ఖండించాడు.

నిజం బయటకు రానివ్వండి..

నిజం బయటకు రానివ్వండి..

తప్పుడు ఆరోపణలపై వార్తలు రాయడంపై ప్రదీప్ స్పందిస్తూ.. కొందరు మీడియాలో అవి నిజమనుకుని నిర్దారణ చేసి రాసేస్తున్నారని మండిపడ్డాడు. నిజాన్ని బయటకు రానివ్వండి అంటూ నాడు ప్రదీప్ అందర్నీ ప్రార్థించాడు. అయితే ఆలస్యంగానైనా సరే నిజం బయటకు వచ్చింది. నిన్న సదరు మహిళ మీడియాతో మాట్లాడుతూ సంచలన నిజాలు బయట పెట్టింది.

బలవంతంగా చెప్పించారు..

బలవంతంగా చెప్పించారు..

తనపై ఎవ్వరూ అత్యాచారం చేయలేదని, ప్రదీప్, కృష్ణుడికి ఎలాంటి సంబంధం లేదని సదరు మహిళా క్లారిటీ ఇచ్చింది. డాలర్ భాయ్ తనను బెదిరించాడని, అలా చెప్పమని బలవంతం చేశాడని మీడియా ముందు ఒప్పుకుంది. అలా ప్రదీప్, కృష్ణుడిపై పడ్డ నిందలు తొలిగిపోయాయి.

Recommended Video

Rashmika Mandanna Childhood Magazine Picture Gone Viral
ఎంత మంది చూస్తారు..

ఎంత మంది చూస్తారు..


అయితే ఈ వార్తలపై సింగర్ గీతామాధురి స్పందించింది. ఆరోపణలు చేసిన వార్తలను ఎంత మంది చదివి ఉంటారు? ఇలా క్లారిటీ ఇచ్చిన వార్తలను ఎంత మంది చదివి ఉంటారు? అంటూ ఓ సెటైర్ వేసింది. అది చూసినంత మంది ఇది చూస్తారా?.. సత్యమేవ జయతే.. నేను చెప్పగలిగేది అదొక్కటే అంటూ గీతా మాధురి అసహనం వ్యక్తం చేసింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X