గీతా మాధురి ఫోటోతో వాట్సాప్ చాటింగ్.. నమ్మించి మోసం చేస్తున్న కేటుగాళ్లు.. ఏమైందంటే?

సింగర్ గీతా మాధురి గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. టాలీవుడ్ లో చాలా క్రితమే ఎంట్రీ ఇచ్చిన ఈ భామ అనేక సాంగ్స్ తో మంచి పేరు సంపాదించి, అభిమానులను కూడా అదే స్థాయిలో సంపాదించింది. ఎక్కువగా మాస్ సాంగ్స్ పాడుతూ ఉండే గీతామాధురి క్లాస్ ఆడియన్స్ కి కూడా తన క్లాస్ సాంగ్స్ తో దగ్గర అయింది. అయితే తాజాగా ఆమె తన పేరుతో మోసం జరుగుతుంది అంటూ సోషల్ మీడియాలో వెల్లడించింది. దానికి సంబంధించిన వివరాల్లోకి వెళితే

సింగర్ గీతా మాధురి టాలీవుడ్ లో పాపులర్ సింగర్. తనదైన గాత్రంతో అనేక మాస్ సాంగ్ క్లాస్ సాంగ్స్ పాడుతూ గీతామాధురి పేరు తెచ్చుకున్నారు. సింగర్ గానే పాపులర్ అయిన ఆమె ఆ పాపులారిటీతో బిగ్ బాస్ షోలో కూడా పాల్గొన్నారు. బిగ్ బాస్ సీజన్ 2లో పాల్గొన్న ఆమె మంచి పోటీ ఇచ్చారు. ఈ క్రమంలోనే ఆమె బిగ్ బాస్ సీజన్ 2 రన్నర్ అప్ గా నిలిచింది. కౌశల్ ఆర్మీ అంటూ పెద్ద ఎత్తున హల్చల్ చేసిన సమయంలో కూడా గీత మాధురి తనదైన శైలిలో గేమ్ ఆడుతూ సెకండ్ ప్లేస్ వరకు వచ్చింది.

కౌశల్ కు గట్టి పోటీ ఇచ్చిన గీతామాధురి కప్పు మాత్రం గెలవలేకపోయింది. అయితే నటుడు నందుని ప్రేమించి వివాహం చేసుకున్న గీతా మాధురి దాక్షాయిని ప్రకృతి అనే ఒక చిన్నారికి జన్మనిచ్చింది. ఆ తరువాత వారిద్దరూ విడిపోతారని ప్రచారం జరిగింది కానీ అదేమీ లేదని తర్వాత క్లారిటీ వచ్చేసింది. అయితే ప్రస్తుతం తన పేరుతో ఆన్‌లైన్లో మోసం చేయడానికి ప్రయత్నించారు అంటూ గీతా మాధురి సోషల్ మీడియా వేదికగా వెల్లడించింది.

Geetha Madhuri warns about mis using her name and photos in WhatsApp

ఎవరో తన లాగే వాట్సాప్ లో చాటింగ్ చేస్తున్నారని, నా ఫోటో ప్రొఫైల్ పిక్చర్ గా పెట్టుకుని ఒక అమెరికా నెంబర్ తో చాటింగ్ చేస్తూ ఇతరు సింగర్స్ ఫోన్ నెంబర్స్ కావాలని అడుగుతున్నారని అది నేను కాదని దయచేసి అర్ధం చేసుకోండని కోరింది. అది నేను కాదు జాగ్రత్తగా ఉండండి ఎవరి నెంబర్లు షేర్ చేయకండి అంటూ గీతామాధురి తన సోషల్ మీడియా వేదికగా హెచ్చరించింది.
నిజానికి గతంలో ఇలాంటి అనుభవాలు సింగర్ సునీతకు కూడా ఎదురయ్యాయి. ఇదే విధంగా ఒక అమెరికా నెంబర్లతో చాటింగ్ చేస్తూ ఇతర సింగర్స్ ఫోన్ నెంబర్లు అడుగుతున్నట్లు సునీత కూడా తన సోషల్ మీడియా వేదికగా హెచ్చరించింది.

ఇప్పుడు అదే విషయం గీతా మాధురి దాకా వచ్చిందని చెప్పవచ్చు ఇక కేవలం సింగర్స్ మాత్రమే కాదు యాంకర్లు, నటీనటుల పేర్లతో కూడా ఈ కేటు గాళ్ల బ్యాచ్ చాటింగ్ చేస్తూ సెలబ్రిటీల ఒరిజినల్ నెంబర్లు తెలుసుకునే ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తోంది అయితే దీని వెనక ఇంకా ఏమైనా కారణాలు ఉన్నాయా అనేది తెలియాల్సి ఉంది ఇక దీనికి సంబంధించి గీతామాధురి పోలీస్ కంప్లైంట్ కూడా ఇవ్వడానికి సిద్ధమైనట్లు సమాచారం తన పేరును దుర్వినియోగం చేస్తున్నారని సదరు వ్యక్తుల మీద చర్యలు తీసుకోవాల్సిందిగా గీతామాధురి కోరే అవకాశం ఉందని అంటున్నారు. చూడాలి మరి ఈ విషయం ఏమవుతుందో.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X