అంజలి, బ్రహ్మానందాన్ని నమ్మి ‘గీతాంజలి’ (ఫోటోలు)

By Bojja Kumar

హైదరాబాద్: అంజలి, బ్రహ్మానందం, శ్రీనివాసరెడ్డి ప్రధాన పాత్రల్లో ఎం‌వి‌వి సత్యనారాయణ నిర్మాతగా ఎం.వి.వి సినిమా బ్యానర్లో కోన వెంకట్ సమర్పణలో తెరకెక్కుతున్న చిత్రం 'గీతాంజలి'. తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన ఫస్ట్‌లుక్ పోస్టర్ ఆవిష్కరణ కార్యక్రమం హైదరాబాద్‌లో జరిగింది. లోగోను బ్రహ్మానందం విడుదల చేయగా, ఫస్ట్ లుక్ వివి వినాయక్ విడుదల చేసారు. ఈ చిత్రానికి రాజ్ కిరణ్ దర్శకత్వం వహించారు.

ఈ సందర్భంగా సినిమా గురించి రచయిత కోన వెంకట్ మాట్లాడుతూ....'అంజయలి చేయడం వల్లనే 'గీతాంజలి' సినిమా చేస్తున్నాను. ఆమె కాదంటే చేయకపోయే వాడిని. ఈ టైటిల్ వినగానే అందరికీ గతంలో వచ్చిన 'గీతాంజలి' సినిమా గుర్తుకొస్తుంది. కానీ ఇది లవ్ స్టోరీ కాదు. దాని పేరు చెడగొట్టకుండా చేస్తున్నాం. ఇది హారర్ కామెడీ. అంజలిని, బ్రహ్మానందంగారిని నమ్మి ఈ సినిమా చేసాం. శ్రీనివాస రెడ్డి కీలక పాత్ర పోషించారు. రావు రమేష్ డిఫరెంటు కేరక్టర్ చేస్తున్నారు. అంజలి తనను తాను ఆవిష్కరించుకునేలా ఈ సినిమా ఉంటుంది. బ్రహ్మానందం కామెడీ ఈ చిత్రానికి గుండె కాయ లాంటిది అన్నారు.


స్లైడ్ షోలో మరిన్ని వివరాలు, ఫోటోలు....

దర్శకుడు మాట్లాడుతూ...

దర్శకుడు మాట్లాడుతూ...

కోన వెంకట్ డైలాగులు అంటే నాకు చాలా ఇష్టం. ఆయన డైలాగులు రాసిన సినిమాకు దర్శకత్వం వహించడం ఆనందంగా ఉంది. అంజలికి నేను పెద్ద ఫ్యాన్. ఆమెతో సినిమా చేయడం హ్యాపీగా ఉంది అన్నారు.

వివి వినాయక్ మాట్లాడుతూ...

వివి వినాయక్ మాట్లాడుతూ...

బ్రహ్మానందం, కోన వెంకట్ కాంబినేషన్....దర్శకుడు కూడా మంచి టాలెంటు ఉన్నవాడు, శ్రీనివాసరెడ్డి ముఖ్యమైన పాత్ర చేస్తున్నారు...ఈ సినిమా హిట్ కావడానికి అవకాశాలు చాలా ఉన్నాయి అన్నారు.

బ్రహ్మానందం మాట్లాడుతూ...

బ్రహ్మానందం మాట్లాడుతూ...

ఇప్పటి వరకు దాదాపు 987 సినిమాలు చేసాను. పరిశ్రమ నన్ను పెంచి పోషించింది. నాకు సహకరించిన ప్రతి ఒక్కరికీ రుణపడి ఉంటాను. తొలుత శ్రీనివాసరెడ్డి కథ చెబితే మొహమాటానికి ఒప్పుకున్నాను. కోన వెంకట్ ఎంటరయ్యాక కాదనలేక పోయాను. డైరెక్టర్ బాగా డీల్ చేసారు అన్నారు.

అంజలి మాట్లాడుతూ...

అంజలి మాట్లాడుతూ...

బ్రహ్మానందంగారితో కలిసి పని చేయడం చాలా హ్యాపీగా ఉంది. రాజ్ కిరణ్ కొత్తవాడైనా బాగా చేస్తున్నారు. హీరోయిన్ ఓరియంటెడ్ పాత్ర చేయడం ఇదే తొలిసారి. ఈ చిత్రం అందరికీ నచ్చుతుందనే నమ్మం ఉంది అన్నారు.

నిర్మాత మాట్లాడుతూ...

నిర్మాత మాట్లాడుతూ...

కోన వెంకట్ నాకు మంచి మిత్రుడు. చాలా కాలంగా సినిమా చేద్దామని అనుకుంటున్నాం. ఈ సినిమా కథ బాగా నచ్చింది. ఓ వైపు నవ్విస్తూనే భయ పెడుతుంది. సినిమా చూసి అందరూ ఆనందంగా బయటకు వస్తారు అన్నారు.

సినిమాలో ఎవరెవరు?

సినిమాలో ఎవరెవరు?


ఈ చిత్రంలో అంజలి, బ్రహ్మానందం, శ్రీనివాసరెడ్డి, రావు రమేష్, హర్షవర్ధన్ రాణే, పృథ్వి, సత్యం రాజేష్, వెన్నెల కిషోర్, శ్రవణ్, మధునందన్, షకలక శంకర్ ఇతర పాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రానికి డాన్స్ : శేఖర్, శివ తుర్లపాటి, యాక్షన్: విజయ్, ఎడిటింగ్: ఉపేంద్ర, కెమెరా: సాయిశ్రీరామ్, సంగీతం: ప్రవీణ్ లక్కరాజు, రచనా సహకారం: అనిల్ రావిపూడి, వెంకటేష్ కిలారు, స్క్రీన్ ప్లే-మాటలు: కెన వెంకట్, సమర్పణ: కోన వెకంట్, సహ నిర్మాత: విఎస్ఎన్ కుమార్, నిర్మాత: ఎం.వి.వి.సత్యనారాయణ, కథ-దర్శకత్వం: రాజ్ కిరణ్.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X