‘గీతాంజలి’ సినిమా వాయిదా, ఆసుపత్రిలో దర్శకుడు

By Bojja Kumar

హైదరాబాద్: అంజలి ప్రధాన పాత్రలో రాజ్ కిరణ్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం 'గీతాంజలి'. హారర్ అండ్ కామెడీ నేపథ్యంలో తెరకెక్కిన ఈ చిత్రం ఆగస్టు 8న విడుదల కావాల్సి ఉండగా...ఒకరోజు ఆలస్యంగా ఆగస్టు 9న విడుదల కాబోతోంది. సెన్సార్ కార్యక్రమాలు సమయానికి పూర్తికాక పోవడమే ఈ వాయిదాకు కారణమని తెలుస్తోంది.

అంజలి ప్రధాన పాత్రలో నూతన దర్శకుడు రాజ్ కిరణ్ దర్శకత్వంలో తెరకెక్కిన హారర్ అండ్ కామోడీ చిత్రం 'గీతాంజలి'. రచయిత కోన వెంకట్ సమర్పణలో ఎమ్.వి.వి.సినిమాస్ పతాకంపై ఎమ్.వి.వి.సత్యనారాయణ ఈ చిత్రాన్ని నిర్మించారు. హర్షవర్ధన్ రాణె, శ్రీనివాస రెడ్డి, రావు రామేష్, బ్రహ్మానందం తదితరులు ఇతర ప్రధాన పాత్రలు చేశారు.

'Geethanjali' movie postponed, released on 9th

ప్రవీణ్ లక్కరాజు ఈ చిత్రానికి సంగీతం అందించారు. శ్రీనివాసరెడ్డి, సత్యం రాజేష్, హర్ష వర్దన్ రాణె, రావు రమేశ్, అలీ, రఘుబాబు, పృథ్వీ, ఝాన్సీ, వెన్నెల కిశోర్, శ్రవణ్, మధునందన్, సీవీఎల్ నరసింహారావు, దీక్షితులు తారాగణమైన ఈ చిత్రానికి రచనా సహకారం: అనిల్ రావిపూడి, వెంకటేశ్ కిలారు, కథా విస్తరణ, స్క్రీన్‌ప్లే, మాటలు: కోన వెంకట్, సినిమాటోగ్రఫీ: సాయి శ్రీరామ్, సహ నిర్మాత: వి.ఎస్.ఎన్. కుమార్ చీమల.

దర్శకుడికి గుండె పోటు...
గీతాంజలి' చిత్రానికి దర్శకత్వం వహిస్తున్న దర్శకుడు రాజ్ కిరణ్ నిన్న గుండె పోటుకు గురయ్యారు. వెంటనే అతన్ని మెహదీపట్నంలోని ప్రైవేట్ ఆసుపత్రిలో చేర్పించారు. త్వరలో సినిమా విడుదలవుతున్న నేపథ్యంలో దర్శకుడు గుండె పోటుకు గురి కావడం చిత్ర యూనిట్ సభ్యులను షాక్ కు గురి చేసింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X