‘గీతాంజలి’ ప్రెస్ మీట్లో సందడి చేసిన అంజలి(ఫోటోస్)
హైదరాబాద్: హీరోయిన్ అంజలి ప్రధాన పాత్రలో రాజ్ కిరణ్ దర్శకత్వంలో తెరకెక్కిన 'గీతాంజలి' చిత్రం ఈ నెల 9న విడుదల చేయాలని నిర్ణయించారు. ఈ నేపథ్యంలో సినిమా యూనిట్ సభ్యులు మీడియా సమావేశం ఏర్పాటు చేసారు. రచయిత కోన వెంకట్ సమర్పణలో ఎమ్.వి.వి.సినిమాస్ పతాకంపై ఎమ్.వి.వి.సత్యనారాయణ ఈ చిత్రాన్ని నిర్మించారు.
ఈ చిత్రంలో అంజలితో పాటు శ్రీనివాస రెడ్డి, హర్షవర్ధన్ రాణె, రావు రామేష్, బ్రహ్మానందం తదితరులు ఇతర ప్రధాన పాత్రలు చేశారు. ప్రవీణ్ లక్కరాజు ఈ చిత్రానికి సంగీతం అందించారు. ఇటీవల విడుదలైన ఈ చిత్రం ఆడియో ప్రేక్షకాదరణ పొందింది. మీడియా సమావేశానికి సంబంధించిన ఫోటోలు, వివరాలు స్లైడ్ షోలో...

అంజలి మాట్లాడుతూ
నాకు ఈ సినిమా చాలా స్పెషల్. నేను ఈ సినిమా చేయడానికి కారణం నా క్యారెక్టర్. ఈ క్యారెక్టర్ నా కెరీర్ లో ఓ మైలురాయిలాగా నిలిచిపోతుంది. మా డైరెక్టర్ రాజ్ కిరణ్ గారు చెస్ట్ పెయిన్ తో హాస్పటల్లో అడ్మిట్ అయ్యారు. ఆయన త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నాను. ఈ చిత్రం అందరికీ నచ్చుతుందనే నమ్మకం ఉంది అన్నారు.

కోన వెంకట్ మాట్లాడుతూ
అజంలి ఈ సినిమా చేయడానికి ఒప్పుకుని ఉండక పోతే ఈ సినిమా లేదు. గీతాంజలి పాత్రకు పూర్తి న్యాయం చేసింది అంజలి. హారర్ కామెడీ కథ ఇది. నా ప్రతి సినిమాలోనూ బ్రహ్మానందం గారి కోసం ఓ స్పెషల్ రోల్ ఉంటుంది, ఈ సినిమాలో కూడా ఓ మంచి రోల్ తో పాటు, ఓ స్పెషల్ పాట చేసారు. రాజ్ కిరణ్ ఈ చిత్రాన్ని అద్భుతంగా తెరకెక్కించారు. సినిమా మంచి విజయం సాధిస్తుందనే నమ్మకం ఉందన్నారు.

విడుదల తేదీ
వాస్తవానికి అంజలి చిత్రాన్ని ఆగస్టు 8న విడుదల చేయాలనుకున్నారు. అయితే కొన్ని కారణాల వల్ల ఆగస్టు 9కి వాయిదా పడింది.

స్టార్స్, టెక్నీషియన్స్
హర్షవర్ధన్ రానే, అపర్ణ వర్మ, పృధ్వీ, వెన్నెల కిషోర్ తదితరులు నటించిన ఈ చిత్రానికి మాటలు, స్క్రీన్ ప్లే, సమర్పణ - కోన వెంకట్, రచనా సహకారం - అనిల్ రావిపూడి, వెంకటేష్ కిలారు, డిఓపి - సాయిశ్రీరామ్, ఎడిటింగ్ - ఉపేంద్ర, సంగీతం - ప్రవీణ్ లక్కరాజు.


Click it and Unblock the Notifications











