‘గీతాంజలి’ సీక్వెల్ వస్తోంది
హైదరాబాద్: ఈ ఏడాది వచ్చిన కామెడీ, హారర్ సస్పెన్స్ థ్రిల్లర్ ‘గీతాంజలి' బాక్సాఫీసు వద్ద మంచి ఫలితాలు సాధించిన సంగతి తెలిసిందే. అంజలి ప్రధాన పాత్రలో రాజ్ కిరణ్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈచిత్రం నిర్మాతలకు మంచి లాభాలు తెచ్చి పెట్టింది. త్వరలో ఈ చిత్రానికి సీక్వెల్ రాబోతోంది.
ఫేస్‌బుక్ ద్వారా లేటెస్ట్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు
‘గీతాంజలి' చిత్రానికి దర్శకత్వం వహించిన రాజ్ కిరణ్.....సీక్వెల్ కు దర్శకత్వం వహించబోతున్నారు. క్రేజీ మీడియా ప్రొడక్షన్స్ అధినేత చినబాబు ఈ చిత్రాన్ని నిర్మించబోతున్నారు. ప్రస్తుతం ఈ చిత్రం ప్రతిపాదనల దశలోనే ఉంది. తారగణం ఇతర వివరాలు ఫైనలైజ్ కావాల్సి ఉంది.

ఈ చిత్రానికి శ్రీనివాస్ వెలిగొండ డైలాగ్స్ అందించబోతున్నారు. త్వరలోనే ఇతర టెక్నీషియన్స్ వివరాలు వెల్లడి కానున్నాయి. 2015లో ఈచిత్రం ప్రారంభం కానుంది. ప్రేక్షకులను పూర్తి స్థాయిలో ఎంటర్టెన్ చేసేలా కామెడీ, హారర్ ఎలిమెంట్స్ జోడించి ఈ చిత్రాన్ని తెరకెక్కించబోతున్నారు.
‘గీతాంజలి' చిత్రంలో అంజలి, శ్రీనివాసరెడ్డి పెర్ఫార్మెన్స్ సినిమాకు బాగా ప్లస్ అయ్యాయి. అయితే సీక్వెల్ లో వీరు ఉంటారా? లేక దర్శకుడు కొత్త నటీనటుల తీసుకుంటారా? అనేది తెలియాల్సి ఉంది.


Click it and Unblock the Notifications











