»   » మానవీయ విలువలు, మనసును తట్టి లేపే కథతో ‘గీతాపురి కాలనీ’

మానవీయ విలువలు, మనసును తట్టి లేపే కథతో ‘గీతాపురి కాలనీ’

Posted By:
Subscribe to Filmibeat Telugu

జీఆర్‌కే ఫిలిమ్స్ బేనర్‌లో దుష్యంత్‌కుమార్ నిర్మిస్తూ ఘరలకంఠ మద్దేటి శ్రీనివాస్ తొలిసారి దర్శకత్వం వహిస్తున్న సినిమా "గీతాపురి కాలనీ". మానవీయ విలువలను చూపిస్తూ మనసుని తట్టి లేపే కథాంశంతో తెరకెక్కిన ఈ చిత్రానికి రాంచరణ్ సంగీతం సమకూర్చగా మహేష్ మట్టి కెమెరామెన్‌గా పనిచేస్తున్నారు.

ఈ మధ్యే షూటింగ్ పూర్తిచేసుకున్న ఈ చిత్రం పోస్ట్‌ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుపుకుంటుంది. ఇప్పటికే రిలీజైన టీజర్‌కి మంచి రెస్పాన్స్ రాగా చిత్ర ఆడియోను జనవరి మూడవ వారంలో చిత్రాన్ని ఫిబ్రవరిలో రిలీజ్ చేసేందుకు ఎర్పాట్లు చేస్తున్నారు చిత్ర యూనిట్.

Geethapuri colony releasing in Jan 2017

ఓక స్లమ్‌లో జరిగే జీవనశైలిని వారు వారి కష్టాల్ని ఏంత పెద్దవిగా బావిస్తున్నారో వాటిని అదిగమించే క్రమంలో వారు ఎదుర్కొనే గమనాల కథలే "గీతాపురి కాలనీ" అని దర్శకుడు తెలిపారు.

నిరుపేద కుటుంబంలో తల్లిని కోల్పోయిన ఇద్దరు పిల్లలు తండ్రే తమకు అన్నీ అనుకుని సోమరిపోతైన ఆ తండ్రిని ఎలా పోషించారు....., కులాలకతీతంగా పెళ్లి చేసుకున్న ఇద్దరి ప్రేమకు ప్రతిరూపాలైన వారి పిల్లల్ని ఈ సమాజం ఎలా రీసీవ్ చేసుకుంది..... బ్రతకడానికి ఏ దారీ లేక బ్రతికేందుకు ఈ సమాజం చూపిన వేశ్యవృత్తిలో బ్రతుకుతున్నా తన కొడుకుని ఉన్నత స్థాయికి తేవాలని పరితపించే తల్లి...... అల్లరి చిల్లరగా తిరుగుతున్న పిల్లవాడు, తాగుబోతైన తండ్రి కానీ కొడుకుని చదివించాలనుకున్నా ఆర్థిక స్థోమత లేని తల్లి...... గతాన్ని మర్చిపోయిన వ్యక్తి జీవితంలోకి వచ్చి నాకు అన్నీ నువ్వే అంటూ గుర్తులేని తన గతాన్ని గుర్తు చేసి చిన్నవయస్సులో జీవితం కోల్పోయిన పిల్లల్ని అక్కున చేర్చుకునే ఓక అమ్మాయ్..... ఇలా ఐదుగురి కథలను దర్శకుడు ఎలా తెరకెక్కించాడో తెలియాలంటే "గీతాపురి కాలనీ" చూడాల్సిందే.

English summary
'Geethapuri Colony' releasing in Jan 2017. The movie directed by Maddeti Srinivas, Produced by Dhushyanth Kumar.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu