హీరోయిన్‌కు లైంగిక వేధింపులు.. దర్శకుడి అరెస్ట్, బెయిల్
ముంబై: జాలీ ఎల్ ఎల్ బీ చిత్ర దర్శకుడు సుభాష్ కపూర్ తనను లైంగింకగా వేధిస్తున్నాడంటూ ఆ చిత్రంలో హీరోయిన్ గీతిక త్యాగి ఆ మధ్య ఆరోపణలు చేసినసంగతి తెలిసిందే. ఆమె రహస్యంగా తీసిన వీడియోలో అతను పశ్చాత్తాపం కూడా వ్యక్తం చేసినట్లుంది. ఈ కేసుకు సంబంధించి సుభాష్ కపూర్ సోమవారం అరెస్టు అయ్యారు.
పోలీసులు వెంటనే అతన్ని కోర్టులో ప్రవేశ పెట్టగా 14 రోజుల జ్యుడీషియల్ కస్టడీ విధించింది. అయితే వెంటనే అతనికి పదివేలరూపాయల పూచి కత్తుపై బెయిల్ లభించింది. తదుపరి విచారణ జరుగాల్సి ఉంది.
సుభాష్ కపూర్ అరెస్టుపై గీతిక స్పందించారు. అతని అరెస్టు తనకు ఉపశమనం కలిగించినట్లు ఉందని వ్యాఖ్యానించారు. అతను అరెస్టు అవుతాడని నాకు తెలుసన్నారు. విచారణ తర్వాత అతను దోషిగా తేలుతాడనే నమ్మకం ఉందని వ్యాఖ్యానించారు.
స్లైడ్ షోలో మరిన్ని వివరాలు...

వీడియో ద్వారా బట్టబయలు
ఆమె రహస్యంగా తీసిన వీడియోలో అతడు పశ్చాత్తాపం కూడా వ్యక్తం చేసినట్లుంది. సుభాష్ కపూర్ భార్య డింపుల్ ఖర్బందా, గీతికా త్యాగి బోయ్ ఫ్రెండ్ అతుల్ సబర్వాల్ కూడా ఈ వీడియోలో ఉన్నారు.

సుభాష్ కపూర్
దాదాపు ఏడాదిన్నర నుంచి ఈ సంఘటన గురించి తాను ఒక్కరోజు కూడా మర్చిపోలేదని, ఆమెకు సాయం చేయాలనే అనుకుంటున్నానని ఆ వీడియోలో సుభాష్ కపూర్ చెప్పినట్లుంది. జరిగిన సంఘటనకు తాను ఎంతో పశ్చాత్తాప పడుతున్నానని కూడా అన్నాడు. తన కొడుకు భవిష్యత్తు గురించి తాను బెంగపడుతున్నట్లు కపూర్ భార్య కూడా చెప్పింది.

గీతిక త్యాగి
గతంలో పాత్రికేయ వృత్తిలో ఉండి.. 'వన్ బై టు', 'వాట్ ద ఫిష్' లాంటి చిత్రాల్లో నటించిన గీతిక.. ఈ వీడియోలో పిచ్చిపట్లినట్లు ఏడుస్తూ, సుభాష్ కపూర్ను తిడుతూ కనిపించింది. ఈ సంఘటన తర్వాత తాను ఎవ్వరినీ నమ్మలేకపోతున్నానని ఆమె చెప్పింది. తాను జర్నలిస్టు కావడంతో ఆయన ఎనిమిదేళ్లుగా తెలుసని కూడా గీతిక తెలిపింది.

అరెస్టు అయ్యాడు
ఈ కేసుకు సంబంధించి సుభాష్ కపూర్ సోమవారం అరెస్టు అయ్యారు. పోలీసులు వెంటనే అతన్ని కోర్టులో ప్రవేశ పెట్టగా 14 రోజుల జ్యుడీషియల్ కస్టడీ విధించింది. బెయిల్ కూడా లభించింది.


Click it and Unblock the Notifications











