twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    'అరుంధతి' హిందీ రీమేక్ - 'త్రీడీ' లో కన్ఫర్మ్ డిటేల్స్

    By Srikanya
    |

    తెలుగులో ఘన విజయం సాధించిన అరుంధతి చిత్రం త్వరలో హిందిలో రీమేక్ కాబోతోంది. అదీ త్రీడీలో అని విశ్వసనీయ సమాచారం. జెమినీ ఫిల్మ్ సర్క్యూట్ వారు ఈ చిత్రాన్ని భారీ రేటు ఇచ్చి సొంతం చేసుకున్నారు. అలాగే ఈ చిత్రం రైట్స్ కోసం బోనీకపూర్ చివరి వరకూ పోటీపడ్డారు. ఇక ఈ చిత్రం తమిళ, తెలుగు, మళయాళ భాషల్లో విజయం సాధించటం పరిగణనలోకి తీసుకునే జెమినీ వారు ఈ చిత్రాన్ని హిందీలో ప్లాన్ చేస్తున్నారు. త్రీడిలో అయితే మరింత హారర్ గా మారి నేషనల్ వైడ్ గా మంచి పేరు, డబ్బు తెస్తుందని ఆశించి కొన్నామని చెప్తున్నారు. ఇక ఈ విషయమై శ్యామ్ ప్రసాద్ రెడ్డి మాట్లాడుతూ...ఈ చిత్రం హిందీలో కూడా పెద్ద విజయం సాధిస్తుందని, తెలుగు చిత్రాన్ని బీట్ అవుట్ చేస్తుందని భావిస్తున్నానని చెప్పారు. ఇక ఈ చిత్రం సాంకేతిక నిపుణులు,ఆర్టిస్టులు ఎంపిక ఇంకా పూర్తికాలేదు. అనూష్క,సోనూసూద్ కూడా వారి స్టార్ కాస్టింగ్ లెక్కల్లో ఉన్నారు. ఇక ఇప్పటికే అనూష్క ప్లేసులో అసిన్, ఐశ్వర్య రాయ్, విధ్యాబాలన్ పేర్లు వినిపించాయి.

     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X