మణిరత్నం-సమంత చిత్రానికి రికార్డు స్థాయి ధర
ప్రముఖ దర్శకుడు మణిరత్నం దర్శకత్వంలో 'కడల్' అనే తమిళ చిత్రం రూపొందుతున్న సంగతి తెలిసిందే. ఇందులో సీనియర్ నటుడు కార్తీక్ కొడుకు గౌతమ్ హీరోగా పరిచయం అవుతున్నాడు. అతనికి జంటగా హాట్ ముద్దుగుమ్మ సమంత నటిస్తోంది. ఇతర ప్రధానపాత్రలో యాక్షన్ కింగ్ అర్జున్, అరవింద్ స్వామి, మోహన్‌బాబు కుమారుడు లక్ష్మీప్రసన్న, తంబిరామయ్య తదితరులు నటిస్తున్నారు.
ఈ చిత్రానికి సంబంధించిన ఓ హాట్ న్యూస్ వెలుగులోని వచ్చింది. జెమిని ఫిల్మ్ సర్క్కూట్ వారు ఈ చిత్రాన్ని రికార్డు స్థాయి ధర చెల్లించి థియేటర్ రైట్స్ సొంతం చేసుకున్నారని సమాచారం. ఇందు కోసం రూ. 25 కోట్ల వరకు ఆఫర్ చేశారని తమిళ సినీ వర్గాల సమాచారం. మణిరత్నం ఈ మధ్య వరుస ప్లాపులు ఎదుర్కొంటున్నా ఈ రేంజ్‌లో ఆఫర్ రావడం సర్వత్రా చర్చనీయాంశం అయింది.
ఈ చిత్రానికి మణిరత్నం ఆస్థాన సంగీత దర్శకుడు ఏఆర్. రెహ్మాన్ సంగీత బాణీలు కడుతుండగా, రాజీవ్‌మీనన్ ఛాయాగ్రహణం అందిస్తున్నారు. శ్రీకార్ ప్రసాద్ కూర్పు బాధ్యతలను నిర్వహిస్తున్న ఈ చిత్రం మద్రాసు టాకీస్ పతాకంపై రూపొందుతున్న 14వ చిత్రం. అలాగే మణిరత్నం దర్శకత్వంలో రూపొందుతున్న 23వ చిత్రం కావడం విశేషం.
మణిరత్నం, ఏఆర్ రెహ్మాన్ కాంబినేషన్ లవ్ స్టోరీ కావడంతో సినిమా మంచి విజయం సాధిస్తుందనే నమ్మకంతోనే జెమినీ ఫిల్మ్స్ వారు ఇంత పెద్ద మొత్తంలో చెల్లించడానికి ముందుకు వచ్చిందని తమిళ సినీ వర్గాలు చర్చించుకుంటున్నారు. మరి వారి నమ్మకం ఎంతవరకు నిజం అవుతుందో చూడాలి.


Click it and Unblock the Notifications











