twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    జెమిని టీవీ చేతికి రామ్ చరణ్ ‘తుఫాన్’... అంత రేటా?

    By Bojja Kumar
    |

    హైదరాబాద్: మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ తొలి బాలీవుడ్ మూవీ 'జంజీర్' చిత్రం తెలుగులో 'తుఫాన్' పేరుతో విడుదలకు సిద్ధం అవుతున్న సంగతి తెలిసిందే. తెలుగు వెర్షన్ 'తుఫాన్' శాటిలైట్ రైట్స్ జెమినీ టీవీ వారు సొంతం చేసుకున్నారు. ఇందుకోసం వారు రూ. 7 కోట్లు చెల్లించినట్లు తెలుస్తోంది. ఒక ద్విభాషా చిత్రం తెలుగు శాటిలైట్స్ ఈ రేంజిలో రావడం ఇదే తొలిసారి అంటున్నారు ట్రేడ్ నిపుణులు. రామ్ చరణ్ స్టార్ ఇమేజ్ వల్ల ఇంత ధర పలికిందని అభిప్రాయ పడుతున్నారు.

    అపూర్వ లఖియా దర్శకత్వం వహిస్తున్న ఈచిత్రంలో సెక్సీలేడీ ప్రియాంక చోప్రా హీరోయిన్. హిందీ వెర్షన్లో షేర్ ఖాన్ పాత్రను సంజయ్ దత్ పోషిస్తుండగా, తెలుగు వెర్షన్లో శ్రీహరి విలన్ షేర్ ఖాన్ పాత్ర పోషిస్తున్నారు. సోనూసూద్ ఐపీఎల్ మ్యాచ్ లో గాయపడి షూటింగులో పాల్గొనే స్థితిలో లేక పోవడంతో అతని స్థానంలో శ్రీహరిని తీసుకున్నారు.

    అమితాబ్ అభిమానుల కోరిక మేరకు 'జంజీర్' చిత్రంలో ఆయనతో గెస్ట్ రోల్‌ చేయిస్తున్నారు. ఈ విషయాన్ని రామ్ చరణ్ తేజ్ ఇటీవల మీడియాకు వెల్లడించారు. అయితే హిందీ వెర్షన్ జంజీర్ వరకు మాత్రమే అమితాబ్ గెస్ట్ రోల్ పరిమితమని, తెలుగు వెర్షన్ 'తుఫాన్' లో మెగాస్టార్ చిరంజీవి గెస్ట్ రోల్ ఉండవచ్చనే ఊహాగానాలు వ్యక్తం అవుతున్నాయి.

    English summary
    Ram Charan's Zanjeer telugu version 'Toofan' Satellite Rights baged by Gemini TV. Gemini TV offering a fancy price of Rs. 7 Crore. Zanjeer directed by Apoorva Lakhia. It is a remake of the Hindi 1973 film of the same name.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X