టూ పీసెస్ దుస్తులు కూడా వేసుకోవాలి...జెనీలియా
కొన్ని సందర్భాల్లో ఇష్టం లేకపోయినా దర్శక నిర్మాతలు తప్పనిసరి అంటే టూ పీసెస్ దుస్తులు కూడా ధరించాల్సి వస్తుంది అంటోంది జెనీలియా. చిత్ర పరిశ్రమలో ప్రవేశించి పదేళ్ళు అయిన సందర్భంగా ఆమె మీడియాతో మాట్లాంది. ఆమె మాటల్లోనే...నటన అనేది చాలా కష్టమైన వృత్తి. అందులో పూర్తిగా లీనమై నటించే నటీనటులే రాణించగలరు. తోటి నటీనటుల నుంచి కూడా చాలా నేర్చుకోవచ్చు. అందుకే నేను అందరు నటీనటులతో స్నేహంగా ఉంటాను. వారిలోని మంచి లక్షణాలను అలవాటు చేసుకోడానికు అని ఆమె చెప్తోంది. అయినా నటీనటులు కొన్ని విధానాలను విధిగా పాటించాలి. నడక దగ్గర నుంచి ధరించే దుస్తుల వరకు ప్రత్యేక శ్రద్ధ వహించాల్సి ఉంటుంది అని సలహా ఇస్తోంది.
ఇక రితీష్ దేశముఖ్ తో ఆమె చెట్టాపట్టాలు వేసుకు తిరుగుతోందన్నదానికి సమాధానంగా...నిజం చెప్పాలంటే రితీష్ నాకు మంచి స్నేహితుడు. దీని గురించి ఇంతకంటే విపులంగా వివరించడం నాకిష్టం లేదు. ఇలాంటి వదంతులు సినీ రంగంలో సర్వసాధారణం. రితీష్ నేను తొలి చిత్రంలో కలిసి నటించాం. అందువల్ల మా మధ్య పరస్పర అవగాహన ఉంది. దాన్ని వేరే విధంగా భావించడం సరికాదు. నేనెవరినీ ప్రేమించలేదు. ఎవరితోను చెట్టాపట్టాలేసుకుని తిరగలేదు. షూటింగ్‌లతో బిజీ గా ఉన్నాను. అందుకే ఇతరులతో మాట్లాడే సమయం కూడా లేదు అంటోంది. ప్రస్తుతం ఆమె రామ్ చరణ్ తేజ సరసన ఆరెంజ్ చిత్రంలో హీరోయిన్ గా చేస్తోంది. బొమ్మరిల్లు భాస్కర్ దర్సకత్వంలో రెడీ అవుతున్న ఈ చిత్రం ప్రస్తుతం మెలబోర్న్ లో షూటింగ్ జరుపుకుంటోంది.


Click it and Unblock the Notifications











