షూటింగ్ స్పాట్‌లో చేదు అనుభవాలు..జెనీలియా
షూటింగ్ స్పాట్‌లో ఇప్పటివరకు నాకెలాంటి చేదు అనుభవాలు ఎదురు కాలేదు అంటూ క్లారిటీ ఇచ్చింది జెనీలియా. ఆమెను మీ అభిమాన హీరో ఎవరు..ఎవరితో మళ్ళీ హీరోయిన్ గా నటించటానకి ఇష్టపడతారు అంటే ఇలా స్పందించింది. నాకు ఏ హీరోతోనూ స్పాట్ లో వేరే అనుభవాలు ఎదురుకాలేదు కాబట్టి హీరోలందరూ నా ఫేవరెట్‌లే అంది. అలాగే ప్రత్యేకంగా ఒకరి పేరు చెప్పమంటే కష్టం. ఏ సినిమా బాగుంటే ఆ సినిమాలోని హీరో నచ్చుతాడు అంది. పోనీ హీరోల్లో మీ ఫేవరెట్ కో-స్టార్ ఎవరో చెబుతారా?అంటే అందరు హీరోలు నాతో క్లోజ్ గా ఉంటారు అంది. ఆరెంజ్ సినిమా విడుదయ్యాక కాంట్రావర్శిలో ఇరుక్కున్న జెనిలియా మెళ్ళీ తెలుగులో రానా సరసన బుక్కైంది. తోలేటి ప్రకాష్ దర్శకత్వంలో రూపొందే ఈ చిత్రానికి నా ఇష్టం అనే టైటిల్ ని పెట్టారు.


Click it and Unblock the Notifications











