ఆ సమయంలో తప్ప నా నోరు మూతపడదు..జెనీలియా
నేను మాట్లాడటం మానాలంటే నిద్రపోవాలి. ఆ సమయంలో తప్ప నా నోరు మూతపడటం అంటూ ఉండదు. అందుకే నా స్నేహితులంతా..నువ్వుంటే సందడిగా ఉంటుంది అంటుంటారు. మరీ ఎక్కువగా వాగాననుకోండి..నీ నోటికి తాళం వేస్తామని ఆటపట్టిస్తారు అంటోంది జెనీలియా. ఆమెకు వాగుడు కప్ప అనే పేరు ప్రెండ్ సర్కిల్ లో ఉందిట. అదే విషయం చెప్తూ..కొంతమందైతే జెన్నీ...కాసిన్ని కబుర్లు చెప్పవూ అని అడిగి మరీ చెప్పించుకుంటారు' అంటోంది. ప్రస్తుతం జెనీలియా...రామ్ చరణ్ సరసన బొమ్మరిల్లు భాస్కర్ చిత్రంలో చేస్తోంది. అలాగే తెలుగు, తమిళ్, కన్నడ, హిందీ..ఇలా ప్రస్తుతం ఈ నాలుగు భాషల్లోనూ సినిమాలు చేస్తున్నాను. నేను ఉండేది ముంబయ్ లోనే గానీ పట్టుమని పది రోజులు కూడా ఇంటి పట్టున ఉండటంలేదు. అయినా చాలా చాలా ఆనందంగా ఉంది. ఇంత బిజీగా ఉండటం మామూలు కాదు అంటోంది. ఇక జెనీలియా, రామ్ కాంబినేషన్లో సురేంద్రరెడ్డి రామ్ అండ్ జెన్నీ అనే చిత్రం ప్లాన్ చేస్తున్నారు.


Click it and Unblock the Notifications











