జెనీలియా...మందు కొట్టడం చూసారా?
నన్ను ఈ మధ్య తాగుబోతుగా ఎవరో పనిగట్టుకొని మరీ ప్రచారం చేస్తున్నారు...మందు వాసనే తెలియని నా గురించి అలా ఎందుకు ప్రచారం చేస్తున్నారో నాకు తెలియడం లేదంటూ జెనీలియా మండిపడుతోంది. పార్టీలో తాగేవారితో కలిసి మాట్లాడితే తప్పా? అంటూ జెనీలియా ప్రశ్నిస్తోంది. జెనీలియా త్రాగుబోతుని కొన్ని హిందీ పత్రికల్లో వచ్చిన వార్తలుకు, ఫోటోలకు ఆమె ఇలా స్పందిస్తోంది. అయితే తాటి చెట్టుక్రింద కూర్చుని పాలు త్రాగుతున్నారంటే ఎవరు నమ్ముతారు అని ఆమెను అంటున్నారు. ఎందుకంటే ఆమె గ్లాస్ పట్టుకుని ఓ పబ్ లో తన స్నేహితులకు కంపెనీ ఇస్తూ ఉన్న ఫోటోలు బయిటకు వచ్చాయి. ప్రస్తుతం జెనీలియా...రామ్ చరణ్ సరసన ఆరెంజ్ చిత్రంలో నటిస్తోంది.


Click it and Unblock the Notifications











