జెనీలియాతో గడపాలంటే...
తమ అభిమాన హీరో లేదా హీరోయిన్ ని కలవాలి..ఆమెతో మాట్లాడాలి..కొద్ది క్షణాలైనా ఆమె సమక్షంలో ఉండాలి..కనీసం ఆటోగ్రాఫ్ అయినా తీసుకోవాలి అని ఎవరికి అనిపించదు. సరిగ్గా అదే బలహీనతని క్యాష్ చేసుకోవటానికి కొన్ని కంపెనీలు నడుంబిగిస్తున్నాయి. తాజాగా హాసిని జెనిలియాతో ఓ రోజు గడపాలంటే అంటూ ఓ సాప్ట్ డ్రింక్ కంపెనీ వారు కాంటెస్ట్ పెట్టడానికి నిర్ణయించుకున్నారు. జానేతూ..జానేన చిత్రం హిట్ అనంతరం యూత్ లో ఆమె కొచ్చిన క్రేజ్ ని క్యాష్ చేసుకునేందుకు ఈ నిర్ణయం తీసకున్నారు.
హైదరాబాద్ లో జరిగిన ఆ సాఫ్ట్ డ్రింక్ ప్రమేషన్ వేడుకలో నిర్వాహకులు ఈ నిర్ణయం ప్రకటించారు. గతంలో కూడా కొన్ని సబ్బు కంపెనీలు, ప్రైవేట్ టీవీ ఛానెల్స్ వారు తమ కాంటెస్ట్ లో పాల్గొని గెలిచిన వారికి ఈ రకంగా తమ అబిమాన హీరో లేక హీరోయిన్ తో ఓ రోజు సరదాగా గడిపే అవకాసం కల్పించారు. ఇక ఇదే సబ్జెక్టుతో బాలీవుడ్ లో ఓ సినిమా కూడా ప్రారంభం కానున్నట్లు వినికిడి. అలాగే జెనీలియా..శశిరేఖా పరిణయం అనంతరం ఇంకా ఏ తెలుగు చిత్రం ప్రారంభం కాలేదు. మొన్న ఆమె తమిళం విజయ్ హీరోగా చేసిన సచిన్ చిత్రం ఇక్కడా డబ్బింగ్ అయి ప్లాప్ టాక్ తెచ్చుకుంది. ప్రస్తుతం జెనీలియా ఫాంటా సాప్ట్ డ్రింక్ కి బ్రాండ్ అంబాసిడర్ గా పనిచేస్తోంది.


Click it and Unblock the Notifications











