ఆటాడుకుందాం రా...చాక్లెట్ బ్యూటి!
కోమల కుసుమ హస్తాలతో అందాల రాణులు బ్యాట్ పట్టి మైదానంలో దడపుట్టిస్తే...బాల్‌తో బ్యాట్స్‌మెన్‌లను బోల్తాకొట్టిస్తే.. ఆ సన్నివేశం చూసేవారికి కన్నుల పండువగానే వుంటుంది. సాక్షాత్తు అందాల తార జెనీలియా అదే పని చేసింది. 'సన్ సిల్క్ బిగ్ స్విచ్" రియాలిటీ షోలో భాగంగా జెనీలియా ఈ ఫీట్ చేసారు. జయాపజయాలతో సంబంధం లేకుండా ఆధ్యంతం ఆసక్తిగా సాగిన ఈ షోలో బ్యాటింగ్, బౌలింగ్ విభాగాల్లో విన్నర్‌గా నిలిచిన అందాల తార జెనీలి యా షీల్డ్ గెలుచుకున్నారు.
'బోయ్స్" చిత్రంతో తెరంగేట్రం చేసిన ఈ అందాల ముద్దు గుమ్మ అనతి కాలంలోనే తెలుగు, తమిళ భాషలతో పాటు బాలీవుడ్‌లో సైతం అనేక విజయవంతమైన చిత్రాల్లో నటించి శెభాష్ అనిపించుకుంది. తెలుగులో 'బొమ్మరిల్లు" చిత్రంలో అమాయకమైన అందాల హాసినిగా నటించి యువతరం మనసు దోచుకుంది. తన గ్లామర్‌తో ఇటు సినిమాల్లోను, అటు రియాలి టిషోలోను నటిస్తూ అందరి అభిమానాన్ని చూరగొంటున్న జెనీలియా రియాలి టీషోలో బ్యాట్ పట్టి అందరినీ ఆనందింపచేసింది.


Click it and Unblock the Notifications











