twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    బ్రిటీష్ కాలం నాటి కథతో జెనీలియా చిత్రం

    By Srikanya
    |

    జెనీలియా బ్రిటిష్ వారిని ఎదుర్కొనే యువరాణిగా, నిత్యమీనన్ అమాయకమైన యువరాణి పాత్రలో కనపించే చిత్రం 'ఉరుమి'. ప్రముఖ ఛాయాగ్రాహకుడు, సంతోష్‌శివన్ దర్శకత్వం వహించిన చిత్రం మలయాళంలో సూపర్ హిట్టైంది. ఈ చిత్రాన్ని అదే పేరుతో ఎస్వీఆర్ మీడియా ప్రై.లిమిటెడ్ సంస్థ తెలుగులోకి అనువదిస్తోంది.

    ఈ చిత్రం గురించి ఎస్వీఆర్ మీడియా శోభారాణి మాట్లాడుతూ ..15వ శతాబ్దిలో జరిగిన యథార్థ సంఘటనల ఆధారంగా తెరకెక్కించారు. వాస్కోడిగామా ఇండియాను ఆక్రమించిన తీరు, అప్పుడు భారతదేశాన్ని ఏలుతున్న రాజులు, వారి ప్రతినిధుల ప్రతిఘటనను చూపిస్తూ ఇప్పటి కథలోకి తీసుకెళ్ళి ముడిపెట్టడంలో దర్శకుడు కృతకృత్యులయ్యారు. గ్రాఫిక్స్ ఎక్కువగా లేకుండా సహజత్వానికే పెద్దపీట వేశారు. 'ఉరుమి' అనే టైటిల్ కు 'ది వెపన్' అనేది ట్యాగ్‌లైన్ అని అన్నారు.

    కథ: శంకర్ రామకృష్ణన్, సంగీతం: దీపక్‌దేవ్, కూర్పు: శ్రీకర్ ప్రసాద్, మాటలు: శశాంక్.వి., నృత్యాలు: మధు సముద్ర, యాక్షన్: అనల్ అరసు, కెమెరా, దర్శకత్వం: సంతోష్‌శివన్.

    English summary
    Urumi is about a group of men who wanted to assassinate Vasco Da Gama, the Portuguese explorer who set foot in Kappad in Calicut in 1498. The film will have Genelia D’Souza playing a princess of Portugal.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X