»   »  వర్షంలో జెనీలియా 'జర్నీ'

వర్షంలో జెనీలియా 'జర్నీ'

Posted By:
Subscribe to Filmibeat Telugu
Genelia
ఇది జెనీలియా సీజన్.ఢీ,బొమ్మరిల్లు,రెడీ,ఇలా వరసగా హిట్ సినిమాల్లో ఆఫర్లు సంపాదిస్తూ ముందుకు వెళ్తున్న ముద్దుగుమ్మ జెనీలియా. ఆమె ఇప్పుడు క్రియేటివ్ దర్శకుడు గా పేరు తెచ్చుకున్న కృష్ణవంశీ దర్శకత్వంలో 'జర్నీ' చిత్రంలో నటిస్తోంది. కార్తికేయ క్రియేషన్స్ బ్యానర్‌పై సుంకర మధుమురళి నిర్మిస్తోన్న ఈ సినిమాలో తరుణ్‌కు ఆమె జోడీగా చేస్తోంది. ఖడ్గం తర్వాత కృష్ణవంశీతో సుంకర మధుమురళి నిర్మిస్తున్న చిత్రమిది.

రోడ్డు ప్రయాణం నేపధ్యంలో జరిగే లవ్ స్టోరీ ఈ జర్నీ చిత్రం. ఈ సినిమాకి సంబంధించి గత కొద్దిరోజులుగా అమరావతి రోడ్డుపై కొన్ని సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. అక్కడే వున్న అమరేశ్వరుని దేవాలయంలో మరికొన్ని సన్నివేశాలు, రోడ్డుపై వర్షంలో జెనీలియా పరుగెడుతుండగా ఛేజింగ్ దృశ్యాలను తెరకెక్కించారు. జూలై 8 వరకూ ఈ షెడ్యూల్ జరుగుతుంది.

 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

X