మంచి కథ కోసం ఎదురు చూస్తున్నా: జెనీలియా
సినిమాలకు దూరమైన జెనీలియా ఖాళీగా ఉంటుందనుకుంటే పొరపాటే. ప్రస్తుతం జెనీలియా, రితేష్ వివిధ కార్యకలాపాల్లో కలిసి పని చేస్తున్నారు. ఇటీవల సిసిఎల్ ఫ్రాంచైజీ కొనుగోలు దగ్గర నుంచి వారి ఫిల్మ్ ప్రొడక్షన్ సంస్థ పనుల వరకు అన్నింటినీ కలిసి నిర్వహిస్తున్నారు. ఇప్పటికే ఆమెకు అనేక సినిమా అవకాశాలు వస్తున్నాయి. త్వరలో జెనీలియా మళ్లీ తెరపై కనిపించబోతోంది.
జెనీలియా, రితేష్ గత సంవత్సరం ఫిబ్రవరి 3న పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. జెనీలియా గర్భం దాల్చిందని ఇటీవల వార్తలు వెలువడ్డాయి. అయితే అదంతా అవాస్తవమని తేలంది. ఈ నేపథ్యంలో ఆమె పబ్లిక్ రిలేషన్ మేనేజర్ వివరణ ఇచ్చారు. జెనీలియా గర్భందాల్చిందనే వార్తల్లో వాస్తవం లేదని తెలిపారు. జెనీలియా ఇంకా గర్భం దాల్చ లేదు. అలాంటి విశేషం ఏమైనా ఉంటే గొప్పగా చెప్పుకుంటారు. ఇందులో దాచాల్సింది ఏమీ లేదు. ఇప్పుడప్పుడే రితేష్, జెనీలియా పిల్లలను కనే ఆలోచనలో లేరు' అని వెల్లడించారు.


Click it and Unblock the Notifications












