‘ఆరంజ్’ తో మళ్లీ ఆ రేంజ్ హిట్ కోసం రామ్ చరణ్ పైనే ఆశలు...!?
జెనీలియా ఆశల న్నీ 'ఆరంజ్" పైనే ఉన్నాయి. 'బొమ్మరిల్లు" చిత్రంతో తనకు బ్రహ్మాండమైన హిట్ ఇచ్చిన భాస్కర్.. 'ఆరంజ్" చిత్రంతో తనకు మళ్లీ ఆ రేంజ్ హిట్ ఇస్తాడని జెనీలియా కోటి ఆశలు పెట్టుకుంది. ఎందుకంటే ఇటీవల కాలంలో జెనీలియాకు ఏ భాషలోనూ హిట్ అనేది లేదు. 'శశిరేఖాపరిణయం, లైఫ్ పార్టనర్, కథ, చాన్స్ పె డాన్స్" వంటి చిత్రాలన్నీ పరాజయం పాలయ్యాయి. అందుకే.. 'ఆరంజ్" చిత్రంపై జెనీలియా బోలెడు ఆశలు పెట్టుకుంది. ప్రస్తుతం జెనీలియా తెలుగులో ఈ ఒక్క చిత్రంలోనే నటిస్తోంది. 'మగధీర" అనంతరం భాస్కర్ దర్శకత్వంలో రామ్ చరణ్ నటిస్తున్న, నాగబాబు నిర్మిస్తున్న ఈ 'ఆరంజ్" తెలుగులో తనకు పూర్వ వైభవం ఇస్తుందని ఈ భామ భావిస్తోంది.
తన అల్లరిచిల్లర పనులతో అందరి దృష్టినీ తనవైపు తిప్పుకునే జెనీలియా హీరోయిన్‌గా నటిస్తున్న ఈ చిత్రానికి హరీస్ జైరాజ్ సంగీతం అందిస్తున్నారు. పాటల గురించి హరీష్ జైరాజ్ తన ట్విట్టర్ ద్వారా ఇలా తెలిపారు...'ఈ చిత్రంలోని 1 పాటలకు మినహా అన్ని పాటలకు మ్యూజిక్ కంపోజింగ్ అయిపోయింది...మిగిలిన ఆ ఒక్క పాటను కూడా ఈ నెల 12వ తేదీ నాటికి కంప్లీట్ చేస్తాను" అని ప్రేక్షకులకు తెలిపారు.


Click it and Unblock the Notifications











