Don't Miss!
- News రుణమాఫీపై రేవంత్ రెడ్డి సవాల్ ను స్వీకరిస్తున్నా: హరీష్ రావు
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్‌ప్రదేశ్‌లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
- Sports ఒక్కసారి కమిటైతే నా మాట నేనే వినను- కమిన్స్ Video
- Finance Gold Bonds: గోల్డ్ బాండ్స్ ప్రీమెచూర్ ధర ప్రకటించిన ఆర్బీఐ.. పూర్తి వివరాలివే..
- Automobiles సేఫ్టీలో మహీంద్రా బొలెరో నియోకు కేవలం 1-స్టార్ రేటింగ్.. దీనిపై కంపెనీ ఏమందంటే??
- Technology Realme నుంచి రెండు కొత్త ఫోన్లు లాంచ్ అయ్యాయి! ధర రూ.11,999 కే మొదలు
- Lifestyle వేసవిలో కడుపులో చల్లగా ఉంచే కీరకాయ పెరుగుపచ్చడి-అన్నం, రోటీ లేదా చపాతీ దేనికైనా...
జెనీలియా బహుమతుల వెల్లువ
జెనీలియా చూడటానికి అమాయకంగా చిన్ని చిరునవుతో దర్శనమిస్తుంటుంది. ఆమె వెనుక ఆశ్చర్యకరమైన ఇంకో రహాస్యం ఏంటంటే ఆమె రాష్ట్రీయ, జాతీయ స్థాయిలో ఫుట్ బాల్ ప్లేయర్, ఈ రహస్యమే ఆమె సహజ సౌందర్యాని కి నిదర్శనం. ఈమె మంగళూరు క్యాథలిక్ కుటుంబం నుంచి వచ్చిన స్వీట్ మరియు స్పైసీ గర్ల్. జెనీలియా ఈ జనరేషన్ లోని నటీమణుల్లో తన అందచందాలతో యువకుల హృదయాలలో స్థిరపడింది. తన మాతృ భాష 'కొంఖిని" అయినా తెలుగు, హింది, తమిళ్ మరియు కన్నడ సినిమాలలో కూడా నటించి తన పెర్ ఫార్మెన్సతో ప్రేక్షకుల హృదయాలను దోచుకొన్నది. దక్షిణాది చిత్రాల మీద ఎక్కువ కాన్ సెంట్రేషన్ చూపుతున్నది. హిందిలో 'తుజె మేరీ కసమ్" చిత్రంలో అద్బుతమైన పెర్ ఫార్మెన్స్ చేసింది, తమిళ్ ఫిల్మ్ ఇండస్ట్రీలో శంకర్ దర్శకత్వంలో బాయ్స్, తెలుగులో సత్యం, తర్వాత హ్యాపీ, సాంబ, సై, సినిమాలు మంచి గుర్తింపునిచ్చాయి. బొమ్మరిల్లు సినిమా హిట్ తో సినిమా ఇండస్ట్రీలో ఒక మంచి స్థానం సంపాదించుకొన్నది. దక్షిణాది చిత్రాలలో కూడా నటించి మంచి పేరు సంపాదించుకొంది. బాలీవుడ్ లో చాలా ఆపర్లతో బిజీగా ఉన్నారు. ప్రస్తుతం 'ఇట్స్ మై లైఫ్", 'హుక్ యా క్రుక్", 'యాహూ", 'లైఫ్ పాట్ నర్" సినిమా ప్రాజెక్ట్ తో బిజిగా ఉన్నారు. ఇలాగే తన జీవితంలో మరెన్నో విజయాలను సాదించాలని, దట్స్ తెలుగు తరపున జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతున్నాము.