లిప్ కిస్ రిజెక్టు చేసిన జెనీలియా బోయ్ ప్రెండ్
జెనీలియా బోయ్ ప్రెండ్ రితీష్ దేశముఖ్ తన తాజా చిత్రం జానే ఖాన్ సే ఆయే హై లో లిప్ టు లిప్ కిస్ ని రిజెక్టు చేసాడు. క్లైమాక్స్ లో వచ్చే ఈ సన్నివేశం సినిమాకు చాలా అవసరమైంది అని ఎంతగా దర్శక, నిర్మాతలు చెప్పినా ఒప్పుకోలేదు. షారూఖ్ ఖాన్ లాగే నో కిస్సింగ్ పోలసీ అమలు పరుస్తాడని ఇది తెలిసిన వారు కామెంట్ చేస్తున్నారు. ఇక ఈ విషయమై రితీష్ మీడియాతో మాట్లాడుతూ...నిజమే...నేను ముద్దు సన్నివేశాలకు వ్యతిరేకినే. ఇంతకు ముందు కూడా చాలా మంది ఫిల్మ్ మేకర్స్ ఈ తరహా సన్నివేశం పెట్టాలని డిమాండ్ చేసారు. అయితే సినిమా అయినా వదులుకుంటాను గానీ ముద్దు ఓకే చెయ్యలేను అని ఖచ్చితంగా చెప్పేసాను. అయినా నేను ముద్దు పెట్టకూడదనేది రూల్ కాదు..నాకు అంతమంది యూనిట్ సభ్యులు చూస్తూండగా ముద్దు పెట్టుకోవటం ఇబ్బందికరం అంటున్నాడు. అయినా ముద్దు పెట్టుకునేటప్పుడు అలా డిటాచ్ మెంట్ తో ఉండటం నాకు కష్టమనిపిస్తుంది. అది నటనే అంటే ఒప్పుకోబుద్ది కాదు. అందుకే బుద్ది మంతుడులా ముద్దుకు దూరంగా ఉంటున్నాను. అయితే అదేం కాదు జెనీలియా ఫీల్ అవుతుందని ముద్దుకు దూరం గా ఉంటున్నాడని కొందరు కామెంట్స్ చేస్తున్నారు.


Click it and Unblock the Notifications











