నేను నమ్ముకునేది దానినే...జెనీలియా
నా పని.. నా శ్రమను నమ్ముకోవడమే నాకు తెలిసింది అని స్టేట్ మెంట్స్ ఇస్తోంది జెనీలియా. ఆమెను న్యూ ఇయిర్ సందర్భంగా కలిసిన మీడియా..కొత్త సంవత్సరంలో కొత్త నిర్ణయాలు ఏమైనా తీసుకున్నారా.? అని ప్రశ్నించింది. అందుకు జెనీలియా నాకంత అవసరం లేదు...ప్రత్యేకంగా తీర్మానాలు చేసేసుకోవడం మీద నాకు నమ్మకం లేదు. అలాంటివి అస్సలు పట్టించుకోను.నాకు తెలిసిందల్లా కేవలం నా శ్రమను నమ్ముకోవడమే అంటోంది. తెలుగులోనే కాక హిందీలోనూ వరస సినిమాలు చేస్తున్న జెనీలియా కి హిట్ లు ఫ్లాఫులు కవల పిల్లల్లా వస్తున్నాయి. తాజాగా ఆమె తెలుగులో చేసిన కథ చిత్రం భాక్సా ఫీస్ వద్ద బోల్తా కొట్టింది. అలాగే హిందీలో ఫర్ధీన్ ఖాన్ సరసన చేసిన లైఫ్ పార్టనర్ చిత్రం కూడా ఫ్లాఫ్ అయింది. అయితేనేం ఆమెకు వరస ఆఫర్స్ ఉన్నాయి. 'హుక్ యా క్రూక్', 'ఇట్స్ మై లైఫ్', 'ఛాన్స్ పె డ్యాన్స్' సినిమాలు ప్రస్తుతానికి విడుదలకు సిద్ధమవుతున్నాయి. అలాగే తెలుగులోనూ రామ్ చరణ్ తాజా చిత్రం ఆరెంజ్ లోనూ ఆమె చేస్తోంది. దానిని బొమ్మరిల్లు భాస్కర్ డైరక్ట్ చేస్తున్నాడు. దీన్ని బట్టి జెనీలియా కేవలం శ్రమను నమ్ముకోవటం వల్లే ఛాన్స్ లు వస్తున్నాయనేది నిజం అని అర్ధమవుతోంది.


Click it and Unblock the Notifications











