రొమాన్స్ కోసం జెనీలియాని తీసుకున్నాం
"మొదట మా సినిమాని నాన్-రొమాంటిక్ సినిమాగా తీయాలనుకుని జియాఖాన్‌ని తీసుకున్నాం. అయితే 45 నిమిషాల సినిమా తీశాక సినిమాకి రొమాంటిక్ కోణం అవసరమని భావించాం. దాంతో స్క్రిప్టుతో పాటు హీరోయిన్ రోల్‌ని కూడా మార్చాల్సి వచ్చింది. అలా జెనీలియాని తీసుకున్నాం'' అని కెన్ ఘోష్ తెలిపాడు. షాహిద్ కపూర్ హీరోగా దర్శకుడు కెన్ ఘోష్ రూపొందించిన 'చాన్స్ పే డాన్స్' ఈ నెల 15న ప్రపంచవ్యాప్తంగా విడుదలవుతోంది. ఈ సందర్బంగా ఆయన మీడియాతో మాట్లాడారు. అలాగే ఈ చిత్రంలో షాహిద్ సరసన జెనీలియా రెచ్చిపోయిన నటించింది. ఈ సినిమాలో ఆమె సినీరంగంలోని ఒక కొరియోగ్రాఫర్‌గా కనిపించబోతోంది. ఆమెను షాహిద్ కపూర్ రికమెండ్ చేసారని చెప్తున్నారు. ఇక జియాఖాన్ ని తీసేసి జెనీలియాను తీసుకోవటంపై కొంత వివాదం రేగింది. అయితే జియాతో మాట్లాడి సెటిల్ చేసుకుని షూటింగ్ పూర్తి చేసారు.
జెనీలియా షాహిద్ కపూర్ చాన్స్ పే డాన్స్ బొమ్మరిల్లు ఆరెంజ్ రామ్ చరణ్ తేజ genelia shahid kapoor chance pe dance bommarillu orange ram charan teja


Click it and Unblock the Notifications