Don't Miss!
- News రిజర్వేషన్లు రద్దు చేస్తారు: మోడీ, కేసీఆర్‌పై రేవంత్ సంచలన ఆరోపణలు
- Sports SRH vs RCB: కొంపముంచిన విరాట్ కోహ్లీ జిడ్డు బ్యాటింగ్!
- Technology OnePlus Watch 2 వన్‌ప్లస్ వాచ్ 2 కొత్త వేరియంట్ విడుదల.. ధర, సేల్ పూర్తి వివరాలు..!
- Lifestyle పాలలో తామరవిత్తనాలు కలుపుకొని తాగితే ఇన్ని ప్రయోజనాలుంటాయా..?
- Finance Jio Cinema Premium: నెలకు 29లతో జియో ప్రీమియం..
- Automobiles వందేభారత్ రైళ్లలో 1 లీటర్ వాటర్ బాటిల్ రద్దు.. రైల్వే శాఖ కీలక నిర్ణయం
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్‌ప్రదేశ్‌లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
రొమాంటిక్ ధ్రిల్లర్ 'కథ' లో జెనీలియా పాత్ర!?
గుణ్ణం గంగరాజు నిర్మిస్తున్న కథ చిత్రంలో జెనీలియా తాను పోషించబోయే పాత్ర గురించి చెబుతూ...నాది 'చిత్ర' అనే స్కూల్ టీచర్ పాత్ర. స్కూల్ టీచర్ అనగానే కేవలం పిల్లలకు పాఠాలు చెప్పే పంతులమ్మనే కాదు. ఆత్మవిశ్వాసానికి ప్రతీకగా, విభిన్న భావోద్వేగాలు కలిగిన అమ్మాయిగా ఈ చిత్రంలో కనిపిస్తాను. ఇప్పటివరకు ఇలాంటి పాత్ర చేయలేదు. అన్ని రకాల ఎమోషన్స్ పలికించే అవకాశం కూడా నాకు ఈ పాత్ర ద్వారా దక్కినందుకు ఆనందంగా వుంది. చాలెంజింగ్ గా ఫీలయ్యి చేసిన ఈ పాత్ర రాబోయే 15 సంవత్సరాల వరకు నేను చాలా గర్వంగా చెప్పుకునే విధంగా వుంటుంది అంటోంది. ఇక ఈ చిత్రాన్ని ఆమె ఓ రొమాంటిక్ ధ్రిల్లర్ గా వర్ణిస్తోంది. ఆ విషయాలను చెబుతూ..ఇదొక రొమాంటిక్ థ్ల్రిల్లర్. అన్ని భావోద్వేగాల సమ్మేళనంతో ఈ 'కథ' రూపొందింది. ప్రతి సన్నివేశంలోనూ నవ్యత కనిపిస్తుంది. ఇప్పటి వరకు నేను రొమాంటిక్ చిత్రాల్లో చేసినా రొమాంటిక్ థ్రిల్లర్ సినిమాలో చేయడం ఇదే తొలిసారి అంటోది. చూడాలి మరి ఆమె చెప్పే మాటల్లో ఎంత నిజముందో.